Newsరహస్యంగా పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ హీరోయిన్.. వరుడు ఎవరో..?

రహస్యంగా పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ హీరోయిన్.. వరుడు ఎవరో..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ అనే తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. సీనియర్ హీరోలందరితో ఆమె నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తుంది. అయితే రాధిక కూతురు కార్తీక నాయర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జోష్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో రంగం సినిమాలో నటించింది. ఆ సినిమా ఈ బ్యూటికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన కార్తీక.. ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

తన ఫ్యామిలీకి చెందిన హోటల్ బిజినెస్ లు చూసుకుంటోంది ఈబ్యూటీ.. అయితే తాజాగా కార్తీక నాయర్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటో చూస్తుంటే ఆమె ఎంగైజ్‌మెంట్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ ఫొటోలో ఓ అబ్బాయిని కౌగలించుకొని చేతికి ఉన్న రింగ్ చూపించింది. దీంతో కార్తీక రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు అర్థమవుతుంది. ఎవరికీ తెలియకుండా ఇంత సీక్రెట్ గా ఎంగైజ్‌మెంట్ చేసుకోవడానికి కారణాలు ఏంటనే విషయం మాత్రం బయటకు రాలేదు. దీంతో ఆ అబ్బాయి ఎవరో మాత్రం ఫొటోలో ఈ బ్యూటీ చూపించలేదు.

దీంతో అబ్బాయ ఎవరై ఉంటారనేది తెలుసుకునేందుకు అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్లో సెర్చ్ చేస్తోన్నారు. కార్తీక నాయర్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వరుడు ఎవరో చెప్పాలని ఆమెను నెటిజన్లు కోరుతున్నార. అతడితో ఎప్పటినుంచో లవ్ లో ఉందని, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందని అంటున్నారు. ఇతడు అతడెవరో త్వరలో బయటపడే అవకాశముంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news