Newsతండ్రికి త‌గ్గ నంద‌మూరి, ద‌గ్గుబాటి వార‌సులు... బాల‌య్య‌, వెంకీ పిల్ల‌లూ శ‌భాష్‌..!

తండ్రికి త‌గ్గ నంద‌మూరి, ద‌గ్గుబాటి వార‌సులు… బాల‌య్య‌, వెంకీ పిల్ల‌లూ శ‌భాష్‌..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా చర్చించుకునేది నందమూరి కుటుంబం, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. ఈ నాలుగు కుటుంబాల గురించి ఇండస్ట్రీలో గానీ, బయట సినీ ప్రేమికులు, కామన్ ఆడియన్స్ ప్రతీ విషయంలో కంపేరిజన్ ఉంటాయి..కామెంట్స్ కూడా ఉంటాయి. దీనికి కారణం ఒక్కటే ఈ నాలుగు కుటుంబాలకి ఓ చరిత్ర ఉంది.

వారసత్వం అంటే ఆస్తులు మాత్రమే పంచుకోవడం కాదు, మంచితనం దానగుణం కూడా ఉండాలి. ఈ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది నందమూరి ఫ్యామిలీ గురించి. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ గురించి. మిగతా రెండు ఫ్యామిలీల గురించి ఈ విషయంలో మాట్లాడుకోవడానికి ఉన్నా అది నీకేంటి నాకేంటి అనే పద్దతిలో ఉంది. కాబట్టి దాని గురించి అనవసరం.

ఇక బాలయ్య బాబు తన మాదిరిగానే తన పిల్లలు చిత్ర పరిశ్రమలోకి రావాలని అనుకోలేదు. ఏదైనా దైవ సంకల్పం అంటారు. ఆ తర్వాత వాళ్ళకున్న అభిరుచి. అది ఉంటే ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పరు. కొడతారనే మాట వాస్తవం అయినా దానికి బలమైన కారణం ఉంటుంది. అలాగే ఎదుటివాడు పది మాటలంటే వాటికి ఒక్కమాటతోనే సమాధానం చెప్పేస్తారు బాలయ్య.

అంతేగానీ, ఆయనంతట ఆయన ఎవరినీ ఒక్క మాట అనిన సందర్భం లేదు. అదే ఆయన పిల్లలకీ వచ్చింది. బాలయ్య పిల్లలు ఇప్పటి వరకూ నలుగురు నోళ్ళలో నానింది లేదు. ఇదే వెంకటేశ్ కూడా ఫాలో అయ్యారు. ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటూ వెళతారు తప్ప జనాలలో గానీ ఇండస్ట్రీ వర్గాలలో గానీ ఎప్పుడు కాంట్రవర్సీలకి పోయింది లేదు. చాలా డీసెంట్ గా ఉంటారు. ఆయన పిల్లలూ అంతే.

అసలు వెంకీ పిల్లలు ఎంచేస్తున్నారు అంటే కూడా చాలామందికి తెలియదు. అంత డీసెంట్ గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్న వీరు సోషల్ మీడియాలో ఎప్పుడు నానింది లేదనే చెప్పాలి. ఇదంతా తండ్రి నడవడికను బట్టే ఉంటుంది. కానీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలో మాత్రం ఎప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news