Newsమ‌గ‌ధీర 1000 రోజులు.. ఎక్క‌డ‌.. ఏ థియేట‌ర్ తెలుసా..!

మ‌గ‌ధీర 1000 రోజులు.. ఎక్క‌డ‌.. ఏ థియేట‌ర్ తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రామ్‌చరణ్ ఆ తర్వాత టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ అయిపోయాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా మగధీరతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. అప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటికీ పాత‌రేసి పడేసాడు.

మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక తాజాగా ఎన్టీఆర్ తో కలిసి మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆర్ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ పొందటమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

ఇక మగధీర సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఆరోజుల్లోనే సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. మగధీర ఆ రోజుల్లో గుంటూరు – మదనపల్లి – తిరుపతి – కాకినాడ – రాజమండ్రి లాంటి పట్టణాల్లో మ్యాజిక్ క్రియేట్ చేసిది. ఒక్కో ప‌ట్ట‌ణంలో రెండు థియేటర్లలో వంద రోజులు ఆడింది. తెలుగు సినిమా చరిత్రలో ఎంత పెద్ద స్టార్ హీరోకి కూడా ఇలాంటి రికార్డు లేదు.

ఇక మగధీర వెయ్యి రోజులు కూడా ఆడింది. కర్నూలులోని ఒక థియేటర్లో మ‌గ‌ధీర వెయ్యి రోజులు ఆడి రికార్డుల్లోకి ఎక్కింది. సింగిల్ థియేట‌ర్లో ఏకంగా 1002 రోజులు ఆడింది. రామ్ చరణ్ కెరీర్ లోనే ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా మగధీర రికార్డుల్లో నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news