Newsదిల్ రాజుకు గ‌ట్టి ఎదురు దెబ్బ‌... విల‌విలా... గిల‌గిలా...!

దిల్ రాజుకు గ‌ట్టి ఎదురు దెబ్బ‌… విల‌విలా… గిల‌గిలా…!

దిల్ రాజు ది మాస్టర్ మైండ్ అని ఇండస్ట్రీలో ఉన్న టాక్ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో దిల్ రాజుకు చాలా సార్లు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా టాలీవుడ్ లో సంక్రాంతికి దిల్ రాజు వేసిన ఎత్తులు అన్ని వికటిస్తున్న పరిస్థితి. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ లో రెండు.. మూడు సినిమాలకు ప్లేస్ ఉంటుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాను దిల్ రాజు నైజాం ఏరియాకు రు. 45 కోట్లకు మేర‌ పోటీకి వెళ్లి మరీ కొన్నారు.

రు. 45 కోట్ల షేర్ రావాలంటే కనీసం రు. 70 కోట్లకు పైగా షేర్ రావాలి. అల వైకుంఠపురంలో లాంటి సినిమా నైజాంలో రు. 42 కోట్లు వసూలు చేసింది అంటే గుంటూరు కారం దానిని మించిన హిట్ కావాలి. అంటే సరైన పోటీ ఉండకూడదు.. అందుకే దిల్ రాజు తెలివిగా తన సొంత సినిమా ఫ్యామిలీ స్టార్ ను తెరపైకి తెచ్చారు అన్న ప్రచారం ఉంది. రెండు దిల్ రాజు సినిమాలే ఉంటే థియేటర్ల సమస్య ఉండదని ఆయన ప్లాన్ వేసుకున్నారు. అయితే దిల్ రాజు స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు.

విజయ్ దేవరకొండ సినిమా రాకపోతే గుంటూరు కారం మంచి వసూళ్లు రాబట్టుతుంది.. ఇది స్ట్రాటజీ అని ఇప్పటివరకు ఉన్న డౌట్. అయితే ఇది రివర్స్ అయింది. నిన్నగాక మొన్న మొదలుపెట్టిన సినిమాను దిల్ రాజు సంక్రాంతి బరిలో దింపుతాం అంటే ఎప్పుడో సినిమాలో మొదలుపెట్టిన తాము ఎందుకు ?ఆగుతాం అన్నది వెంకటేష్ సైంధవ సినిమా నిర్మాత పాయింట్. ఈ సినిమా పంపిణీ ఆసియన్ సునీల్.. మరో హీరో ఎవరైనా ? సునీల్ వైపు నుంచి దిల్ రాజు సెటిల్ చేసుకుంటారు.

కానీ ఇక్కడ హీరో వెంకటేష్. ఆయన కూడా ఆసియ‌న్ సినిమాలో సమాన భాగస్వామి. సురేష్ బాబు అక్కడ ఉంటారు.. వెంకటేష్ సినిమాకు థియేటర్లు లేకుండా దిల్ రాజు సినిమాకు ఇచ్చేస్తా అనేంత సీన్ అక్కడ ఉండదు. దీంతో ఇప్పుడు గుంటూరు కారం – సైంధవ రెండు సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. రవితేజ ఈగిల్ – పాన్‌ ఇండియా సినిమా హనుమాన్ – ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

నాగార్జున నా సామి రంగ సినిమా కూడా లైన్లో ఉంది. ఇలా సంక్రాంతికి అన్ని వైపుల నుంచి సినిమాలే సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రాజు రు. 45 కోట్లకు కొన్న గుంటూరు కారం సినిమా విషయంలో అదే మాట మీద ఉంటారా లేదా బారసారాలు ఆడి రేటు తగ్గించమన్న డిస్కషన్లు మొదలు పెడతారా అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news