Newsబిగ్ బ్రేకింగ్‌: పుష్ప 2లో చిరంజీవి... అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిప‌డేశారు..

బిగ్ బ్రేకింగ్‌: పుష్ప 2లో చిరంజీవి… అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చిప‌డేశారు..

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న‌ హీరోయిన్గా.. దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ది రూల్. పుష్ప 1 సూపర్ డూపర్ హిట్ అవడంతో పుష్ప 2 మరింత గ్రౌండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో పుష్ప 2పై కనివినీ ఎరిగిన రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

పుష్ప సినిమాను ద‌ర్శ‌కుడు సుకుమార్ పీరియాడిక్ టైంలో ప్లాన్ చేయగా ఫస్ట్ పార్ట్ 1990ల్లో న‌డిస్తే… అందులో ఫ్లాష్ బ్యాక్ 1980 కన్నా ముందు నుంచి ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 2 కి పుష్పరాజ్‌ పాత్ర 2000లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ టైంలో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి హ‌వా నడుస్తుంది. అప్పట్లో మెగాస్టార్ కి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్‌గా పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం సుకుమార్ అదే సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే చిరంజీవి నటించిన ఇంద్ర రిలీజ్ టైంలో పుష్పరాజ్‌ పాత్ర ఉంటుందని… ఇంద్ర సినిమా రిలీజ్ టైంలో టిక్కెట్ల‌ కోసం థియేటర్ దగ్గర పుష్పరాజ్‌ ఎలాంటి ? హంగామా చేసాడు అన్న సీన్లు కూడా సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. బన్నీ ఆన్లైన్లోనే కాదు.. ఆఫ్లైన్లో కూడా మెగాస్టార్‌కు వీరాభిమానిగా ఓ హార్డ్ కోర్ ఫ్యాన్‌గా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులే లేవు. బన్నీ పుష్పరాజ్‌ పాత్రలో మెగా అభిమానిగా కనిపిస్తే పుష్ప 2లో రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news