Newsచిరంజీవి - బింబిసార వ‌శిష్ట సినిమాకు అశ్వ‌నీద‌త్ షాక్‌...!

చిరంజీవి – బింబిసార వ‌శిష్ట సినిమాకు అశ్వ‌నీద‌త్ షాక్‌…!

కల్కి నిర్మాతలు మరోసారి సీరియస్ అయినట్టే కనిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ క‌ల్కి సినిమా విషయంలో నోటీసులు ఇచ్చి 20 రోజులు కూడా కాలేదు.. ఇప్పుడు మరో సినిమా విషయంలో లీగల్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది కూడా అప్పుడెప్పుడో 1990లో చిరంజీవి – శ్రీదేవి జంటగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి కోసం కావటం విశేషం. ఇలా సడన్గా సోషల్ మీడియాలో చిరు క్లాసిక్ హిట్ సినిమాపై చర్చ జరగటం వెనక అసలు ఏం ?జరిగిందన్నదానిపై ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది.

టాలీవుడ్ లో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గురించి తెలిసిందే. ఆయన అప్పటి స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు ఆయన కూతుర్లు కూడా నిర్మాతలుగా మారి మహానటి – సీతారామం – జాతి రత్నాలు లాంటి హిట్స్ సినిమాలతో లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కల్కి అనే పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజులు ముందు కల్కి నుంచి ఒక ఫోటో లీక్‌ అవడం.. అది సోషల్ మీడియాలో సర్కులేట్ కావడంతో కల్కి నిర్మాతలు సీరియస్ అయ్యారు.

ఈ ఫోటో లీక్‌ చేసింది ఎవరైనా సరే దాన్ని షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాలేదు.. ఇప్పుడు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కాపీరైట్స్ విషయంలో ప్రకటన చేయడంతో పాటు తమ సినిమాను ఎవరైనా కాపీ కొడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి హాట్‌ టాపిక్ అయ్యారు. అయితే వైజయంతి మూవీస్ ఈ ప్రకటన చేయటం వెనక ఈ సినిమాలో స్టోరీ, కాన్సెప్ట్, పాత్రల‌ను ఇలా దేన్నీ కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీలులేదని.. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటన జారీ చేశారు.

ఇదంతా కూడా చిరంజీవి – బింబిసారా దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమా కాన్సెప్ట్ హీరో వేరే లోకానికి వెళ్ళటం.. అక్కడ దేవకన్య‌ల‌ను కలవ‌టం సేమ్ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లాగానే ఉంటుందని అంటున్నారు. అందుకే తమ ప్రమేయం లేకుండా వైజయంతి సంస్థ తమ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కాన్సెప్ట్.. స్టోరీ కాపీ కొడితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని పరోక్షంగా ఈ సినిమాను ఉద్దేశించే వార్నింగ్‌ ఇచ్చిందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news