Newsమ‌హేష్‌బాబుతో బోయ‌పాటి సినిమా... అప్పుడు మిస్ అయినా ఈ సారి ప‌క్కా..!

మ‌హేష్‌బాబుతో బోయ‌పాటి సినిమా… అప్పుడు మిస్ అయినా ఈ సారి ప‌క్కా..!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే పక్కా మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు కి పక్కా మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో ? ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.

మహేష్ నుంచి గత కొన్ని సంవ‌త్స‌రాలుగా సరైన మాస్ సినిమా రాలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను – మహేష్ బాబు కాంబినేషన్లో ఒకపక్క కమర్షియల్ సినిమా వస్తే మహేష్‌కు మాస్‌లో మరింత క్రేజ్ పిచ్చిపిచ్చిగా పెరిగిపోతుంది అనటంలో సందేహం లేదు. అయితే గతంలో ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేసిన టైంలో బోయపాటి – మహేష్ బాబుతో సినిమా చేయాలని ఒక కథ కూడా చెప్పాడు. ఆ కథలో యాక్షన్ పార్టు చాలా ఎక్కువగా ఉండటంతో పాటు భయంకరమైన మాస్‌ సినిమా కావడంతో మహేష్ ఒప్పుకోలేదు.

తాజాగా బోయపాటి రామ్‌తో తెరకెక్కించిన స్కంద‌ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే బోయపాటి- మహేష్ బాబు పై చేసిన ఓ సాలిడ్ స్టేట్మెంట్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. మహేష్‌బాబు గారితో ఒక కమర్షియల్ సినిమా చేయాలని కోరిక ఉందని.. మహేష్ ఏదైనా చేయగలరు. మాస్, క్లాస్, ఫ్యామిలి అది ఇది అని లేదు.. ఆయన ఒక ఆల్రౌండర్ అని బోయపాటి స్టేట్మెంట్ ఇచ్చారు.

దీంతో మహేష్ పై బోయపాటి రెస్పాన్స్ మంచి వైరల్ గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అనుకున్నా మాస్ సినిమా మిస్సయింది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మిస్ కాకూడదని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజంగా మహేష్ బాబు- బోయపాటి స్టైల్లో ఒక మాస్ సినిమా చేస్తే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news