Newsబాలీవుడ్ అందాల భామ రేఖ అమితాబ్‌తోనే కాదు.. ఆ కుర్ర హీరోతోనూ...

బాలీవుడ్ అందాల భామ రేఖ అమితాబ్‌తోనే కాదు.. ఆ కుర్ర హీరోతోనూ అప్ప‌ట్లో ఎఫైర్ న‌డిపిందా..!

రేఖ అందాల భామ బాలీవుడ్లో 1970 – 80 ద‌శ‌కాల్లో మకుటం లేని మహారాణిలా ఒక వెలుగు వెలిగిన అందాల భామ ఈ రేఖ. అప్పట్లో అమితాబ్ – రేఖ కాంబినేషన్లో సినిమాలు వస్తున్నాయి అంటే నార్త్ జనాలు వెర్రెక్కి పోయేవారు. వీళ్లిద్దరిని వెండి తెర మీద చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేవారు. వెండితెర మీద వీరిద్దరి కెమిస్ట్రీ ఒక రేంజ్ లో ఉండేది. అయితే నిజ జీవితంలోను వీరిద్దరూ భార్యాభర్తలు అవుతారని అందరూ అనుకున్నారు.

అమితాబ్ – జయాబ‌చ్చ‌న్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో రేఖ చాలా ఏళ్ల పాటు కుమిలిపోయింది.. కుంగిపోయింది. ఆ త‌ర్వాత ఆమె మరో పెళ్లి చేసుకున్నా అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అయితే రేఖ – అమితాబ్ తో కాకుండా మరో హీరోతోను ప్రేమలో పడి సహజీవనం చేసిందని అంటారు. ఆ హీరో ఎవరో కాదు ? అమ్మాయిల విషయంలో కిలాడి కింగ్ గా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్.

అక్షయ్ కుమార్ ఒక రేఖతో మాత్రమే కాదు.. ఆ తర్వాత శిల్పా శెట్టి – రవీనా టాండ‌న్‌తోనూ ప్రేమాయణాలు నడిపాడు. రవీనాటాండ‌న్‌తో అతడికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న టైంలో విడిపోయారు. ఆ త‌ర్వాత శిల్పాశెట్టితోనూ డేటింగ్ చేసి ఆమెను కూడా వ‌దిలించుకున్నాడు. ఆ తర్వాత మరో హీరోయిన్ ట్వింకిల్ ఖ‌న్నాను ప్రేమలో పడేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అక్షయ్ కుమార్.

అయితే రవీనాటాండ‌న్‌.. శిల్పాశెట్టి కంటే ముందే అక్షయ్ కుమార్ రేఖతో ప్రేమలో పడి ఆమెతో చాన్నాళ్ల‌ పాటు డేటింగ్ కూడా చేశాడు అన్న గుసగుసలు బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపించేవి. రేఖ ఎవరో కాదు తమిళ స్టార్ హీరో జెమినీ గణేషన్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. రేఖ తల్లి మన తెలుగు అమ్మాయి అయిన పుష్పవల్లి కావడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news