News' భ‌గవంత్ కేస‌రి ' లో దంచ‌వే మేన‌త్తా కూతురా... ఎక్క‌డ...

‘ భ‌గవంత్ కేస‌రి ‘ లో దంచ‌వే మేన‌త్తా కూతురా… ఎక్క‌డ యాడ్ చేశారంటే…!

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాకు రోజురోజుకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నాలుగు రోజుల్లో రు. 106 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో ఫుల్ లెన్త్ పాటను తీసేసిన సంగతి తెలిసిందే. కథ చెప్పేటప్పుడు ఆ ఫ్లోకు అడ్డు వస్తుందని ఆ పాటను కట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇప్పుడు ఆ సాంగ్ తిరిగి యాడ్ చేస్తున్నారు. ఇది చాలా స్పెషల్ సాంగ్ అంటున్నారు. నిజానికి ఈ పాట నిడివి 4.30 నిమిషాల పాటు ఉంటుంది. సాంగ్ మొత్తం షూట్ చేసి కథ‌కు అడ్డు వస్తుందని తీసేశారు. ఈ పాట షూట్ చేసేందుకు రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఖర్చయింది. ఇందులో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల డ్యాన్సులు చేశారు. అంతకంటే స్పెషల్ ఏంటంటే పాట చివరలో 90 సెకన్ల పాటు దంచవే మేనత్త కూతురా సాంగ్ ను రీమిక్స్ చేశారు.

ఈ సాంగ్ ఈతరం జనరేషన్ కు తెలియకపోవచ్చు.. కానీ 1985 – 90 టైములో బాలయ్య బ్లాక్బస్టర్ మూవీ మంగమ్మ గారి మనవడు సినిమాలో సుహాసిని – బాలయ్య మధ్య వచ్చే సాంగ్ అప్పట్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఎడిటింగ్లో తీసేసిన నాలుగున్నర నిమిషాల సాంగ్‌ను సినిమాకు జత చేస్తున్నారు.

అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మొత్తం పాటను సినిమాలో యాడ్ చేయడం లేదు.. ఆ దంచవే మేనత్త కూతురా బిట్‌ను మాత్రమే యాడ్ చేస్తున్నారు. అది కూడా సినిమా మధ్యలో రావటం లేదు.. రోలింగ్ టైటిల్స్ లో పెడుతున్నారు. దాదాపు 50 మంది డాన్సర్లతో భారీ సెట్ వేసి ఈ సాంగ్ షూట్ చేశారు. ఇప్పుడు కూడా కథలో భాగం చేయడం లేదు. చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ లో పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news