Moviesఅఫిషియల్: జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. కలలో కూడా ఊహించని...

అఫిషియల్: జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. కలలో కూడా ఊహించని ఆఫర్ ఇది..!!

ఇది నిజంగా మీనాక్షి చౌదరి ఫ్యాన్స్ కు వెరీ వెరీ గుడ్ బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు మీనాక్షి చౌదరి పేరు జనాలకు పెద్దగా తెలియలేదు అయితే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఎప్పుడైతే ఆఫర్ అందుకుందో అప్పటినుంచి ఆమె పేరు మారుమ్రోగిపోతుంది . ఆ తర్వాత ఏకంగా ఐదు బడా ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది . ఈ క్రమంలోనే కోలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకుంది మీనాక్షి చౌదరి అంటూ వార్తలు వినిపించాయి.

తాజాగా నేడు దసరా సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రిలీజ్ అయింది . అందరూ అనుకుంటున్న విధంగానే తమిల్ సూపర్ స్టార్ విజయ్ దళపతి సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి తలపతి 68 అనే వర్క్ టైటిల్ ని పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ రాజ సంగీతం అందిస్తూ ఉండగా సిద్ధార్థ నూన సినిమా ఆటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైపోయింది. షూటింగ్ తోనే ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది అంటూ తెలుస్తుంది. దీంతో మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ అందుకుంది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . ఈ సినిమాలో సీనియర్ నటి స్నేహ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రభుదేవా . జయరాం ..లైలా యోగి బాబు తదితరులు ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ చెప్పుకొచ్చింది చిత్ర బృందం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news