Newsమెగాస్టార్ 156 నుంచి అదిరిపోయే అప్‌డేట్లు.. ఐదుగురు హీరోయిన్లు...!

మెగాస్టార్ 156 నుంచి అదిరిపోయే అప్‌డేట్లు.. ఐదుగురు హీరోయిన్లు…!

టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ యేడాది రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోళాశంకర్‌ డిజాస్టర్ అయింది. చిరంజీవి ప్రస్తుతం మోకాలి శాస్త్ర చికిత్స చేయించుకున్న చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని తన కెరీర్లో 156 – 157 సినిమాలలో నటిస్తున్నారు. వాస్తవంగా చిరు 156వ సినిమాగా చిరు పెద్ద కుమార్తె కొణిదెల సుష్మిత – కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించే సినిమా పట్టా లెక్కాల్సి ఉంది.

అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం కాగా ముందుగా చిరు 157 వ సినిమాగా అనుకున్న యూవీ క్రియేషన్స్ బింబిసార‌ దర్శకుడు మల్లిడి వశిష్ట సినిమా కాస్త ముందుకు వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టి సినిమా ప్రారంభించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను ముందుగా ఓ సెలబ్రేషన్ సాంగ్ రీ రికార్డింగ్ పనులతో ప్రారంభించామని.. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని కూడా కన్ఫామ్ చేశారు. దీంతో జస్ట్ పూజా కార్యక్రమం వీడియో మాత్రమే వస్తుంది అనుకున్న మెగా అభిమానులకు ఇది ఊహించని గిఫ్టుగా మారింది.

మరో అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ఏకంగా ఐదుగురు హీరోగా నటిస్తున్నారు. వీరిలో అనుష్క, ప్రియాంక మోహన్ ఈ ఇద్దరు హీరోయిన్లు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు హీరోయిన్ల కోసం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బింబిసారా లాంటి సోషియో ఫాంట‌సీ సినిమా త‌ర్వాత మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా ఇదే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news