Newsమ‌హేష్‌బాబుకే స‌వాల్ విసిరిన ర‌వితేజ‌... ఏం చేశాడో చూడండి..!

మ‌హేష్‌బాబుకే స‌వాల్ విసిరిన ర‌వితేజ‌… ఏం చేశాడో చూడండి..!

టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతి రేసు మామూలుగా లేదు. సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలు ఖ‌ర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఇప్ప‌టికే హ‌నుమాన్‌తో పాటు మ‌హేష్‌బాబు గుంటూరు కారం జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోంది. ప్ర‌భాస్ ప్రాజెక్ట్ క‌ల్కి సంక్రాంతికే అని చెపుతున్నా ఆ సినిమా వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు స‌లార్ కూడా సెప్టెంబ‌ర్ 28 నుంచి వాయిదా ప‌డ‌డంతో ప్ర‌భాస్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో గ్యారెంటీ లేదు.

గుంటూరు కారం మాత్రం సంక్రాంతికి ప‌క్కా. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ 12వ సినిమా కూడా సంక్రాంతికే అంటూ పోస్ట‌ర్ వ‌దిలారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. విజ‌య్ సినిమా ప‌క్క‌న పెడితే మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఈగిల్ సినిమా ఎప్ప‌టి నుంచో సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకుని ఉంది. ఈ ద‌స‌రాకు ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రిలీజ్ అవుతోంది.

ఇక సంక్రాంతికి ఈగిల్ రిలీజ్ క‌న్‌ఫార్మ్ చేశారు. ఈ సినిమాను జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఈ రోజు మేక‌ర్స్ పోస్ట‌ర్‌తో అధికారికంగా క‌న్‌ఫార్మ్ చేశారు. ఇక మ‌హేష్ – త్రివిక్ర‌మ్ గుంటూరు కారం సినిమా ఈగిల్ రిలీజ్ అయిన మ‌రుస‌టి రోజు వ‌స్తున్నా కూడా ర‌వితేజ చాలా డేరింగ్‌గా త‌న సినిమాను సంక్రాంతి రేసులో వ‌దులుతున్నాడు. కంటెంట్ మీద న‌మ్మ‌కం ఉండ‌డంతోనే ఈగిల్ మేక‌ర్స్ అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేద‌ని టాక్ ?

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఇక ఈ రోజు పోస్ట‌ర్‌లో ర‌వితేజ స్టైల్‌గా నిల్చుని ఉండ‌గా.. నిప్పు అంటించిన ఇళ్లు కూడా క‌నిపిస్తోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన గ్లింప్స్ కు ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్సాన్స్ ల‌భించింది. ఈ బిగ్గీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ కాగా… పీఫుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమా నిర్మిస్తోంది. కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news