Moviesపెళ్లి కాకుండానే అలాంటి పని చేసిన రష్మిక.. ఇదేం సాంప్రదాయం రా...

పెళ్లి కాకుండానే అలాంటి పని చేసిన రష్మిక.. ఇదేం సాంప్రదాయం రా బాబోయ్(వీడియో)..!!

ఎవ్వరైనా సరే సాధారణంగా మనకంటే పెద్ద వాళ్లకు గౌరవం ఇవ్వడానికి ..వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ల కాళ్ళను మొక్కుతాం. అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది . తమకంటే చిన్నవాళ్ళని సైతం కాళ్లు మొక్కుతూ కనిపిస్తున్నారు . తాజాగా తనకంటే చిన్నవాడైన ఆదిత్యానాథ్ కాళ్లకు రజనీకాంత్ నమస్కరించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే . కాగా రీసెంట్గా మరోసారి అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా కాళ్లకు ఆమె మేకప్ ఆర్టిస్ట్ నమస్కరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

పెళ్ళికాని 27 ఏళ్ల రష్మిక కాళ్లని ఆమె అసిస్టెంట్ మొక్కడం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా మేకప్ అసిస్టెంట్ సాయి వివాహం ఘనంగా హైదరాబాద్లో జరిగింది . ఈ క్రమంలోనే ఈ వేడుకకు హాజరైన రష్మిక వాళ్లను ఆశీర్వదించారు . నిజానికి రష్మిక వాళ్ళూ తన కాళ్లు మొక్కుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు . ఈ క్రమంలోనే అసిస్టెంట్ సాయి సతి సమేతంగా కాళ్లకు మొక్కడం..దీంతో కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయిన రష్మిక మందన్నా.. భయం భయంగానే ఇబ్బందికరంగానే ఆశీర్వదించింది.

ఎంత అసిస్టెంట్ అయితే రష్మిక మందన్నా చాలా చిన్నమ్మాయి పెళ్లి కానీ అమ్మాయి కాళ్ళు మొక్కడం ఏంటి..? అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఆమె ఎంతో హెల్ప్ చేసి ఉంటే కానీ ఆయన అలా చేసి ఉండడని అది రెస్పెక్ట్ గానే మనం భావించాలి అని.. దీంట్లో కూడా ట్రోలింగ్ ఏం చేస్తారు రా బాబు అంటూ అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. సాయి – రష్మిక ను అంత గౌరవిస్తున్నారంటే ఆమె ఎంత మంచి వ్యక్తి.. ఆయనకు ఎంత హెల్ప్ చేసి ఉండొచ్చు అర్థం చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి సాయి పెళ్ళికాని రష్మిక మందన్నా కాళ్లు మొక్కడం ..ఆమె ఆశీర్వదించడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా రష్మిక -హీరో విజయ్ దేవరకొండను ప్రేమిస్తుందని.. పెళ్లి కూడా చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ, వాళ్ళు దీని పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news