Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఫైన‌ల్‌…!

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఫైన‌ల్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న సినిమా ఎప్పుడు ? స్టార్ట్ అవుతుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రశాంత్ ప్ర‌శాంతంగా బయటికి రాబోతున్నాడు.

అప్పుడైనా ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాని ప్రశాంత్‌ స్టార్ట్ చేస్తాడా ? మరోపక్క వార్ 2 పూర్తి అయ్యాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌కి డేట్లు ఇస్తాడా ? అన్నది సస్పెన్స్ గా ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం అభిమానులు మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతుంది అంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి.

ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకుంటే ఈ సినిమాకు పాన్ ఇండియా బ‌జ్‌తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేక్షకులు అందరిలోనూ సినిమా బ‌జ్‌ పెంచినట్లు అవుతుంది అన్నది ప్రశాంత్ నీల్ ప్లాన్‌. ఇక ఇండియా – పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్సిడెంట్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news