Newsచిరంజీవి ఘరానా మొగుడు - ప్రభాస్ ఛ‌త్రపతి సినిమాకి ఉన్న లింక్...

చిరంజీవి ఘరానా మొగుడు – ప్రభాస్ ఛ‌త్రపతి సినిమాకి ఉన్న లింక్ తెలిస్తే షాక్ అవుతాం…!

ప్రస్తుతం ప్రేక్షకుల‌ ముందుకు వచ్చేచే సినిమాలలో ఎక్కువగా రీమేక్ పాటలే కనిపిస్తున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను నేటి కుర్ర కారుకు నచ్చే విధంగా రీమేక్ చేస్తున్నారు. అప్పటి సినిమా పాటలను ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు వేరైనా మ్యూజిక్ బాగా ఉండటంతో కొందరు వారికి తెలియకుండానే వాటిని కాపీ చేస్తున్నారు. అయితే కొందరు ఈ విషయాన్ని బయటపెట్టిన ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటి కాలంలో హిట్‌ కొట్టిన పాటలు ఇప్పుడు కొన్ని రీమేక్స్ చేసిన మంచి పాపులారిటీ సంపాదించలేదు.

పైగా అలా రీమిక్స్ గా చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ అప్పట్లో వచ్చిన ఘరానా మొగుడు ఆ తర్వాత వచ్చిన చత్రపతి సినిమాలోని ఓ మ్యూజిక్ ఒకేలా ఉంటుంది. పైగా రెండు సినిమాలకు ఒకరే మ్యూజిక్ డైరెక్టర్.. ఇంతకీ ఏం మ్యూజిక్ కాపీ కొట్టారంటే. 1992లో వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు నగ్మా హీరోయిన్గా నటించింది. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను ఎంతో అలరించాయి.

ఇప్పటికీ ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అలరిస్తూనేే ఉన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అద్భుతమైన పాటలు సంగీతాన్ని అందించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఘరానా మొగుడు సినిమాలో కూడా తల్లి సెంటిమెంట్ కనిపిస్తుంది. ఇక చిరంజీవి తల్లి రావు గోపాల్ రావుకు చెల్లెలు అవుతుంది. ఈ క్రమంలో మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది. 2005లో వచ్చిన ఛ‌త్రపతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాల్లో ప్రభాస్ హీరోగా న‌టించాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్ మారిపోయింది. అటు రాజమౌళికి కూడా ఈ సినిమాతోనే స్టార్ డమ్‌ వచ్చింది.

ఛత్రపతి సినిమా కూడా పూర్తిగా తల్లి సెంటిమెంట్ తో నడిచే సినిమా. ఓ వైపు సెంటిమెంట్ ను కురిపిస్తూనే..మరోవైపు భారీ యాక్షన్ ఈ మూవీలో కనిపిస్తుంది. దీంతో అన్ని వర్గాల వారికి ఈ సినిమా బాగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు చిరు ఘ‌రానామొగుడు, ప్ర‌భ‌స్ చ‌త్ర‌ప‌తి ఈ సినిమాలకు సంబంధం ఉంది. ఈ రెండింటికీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. సాధారణంగా నేటి కాలంలోని కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు పాత సినిమాల్లోని ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల మ్యూజిక్ ను కాపీ కొడుతారనే పేరుంది.

అయితే ఘరానా మొగుడు, ఛత్రపతికి సినిమాలకూ మ్యూజిక్ అందించిన కీరవాణి తన సినిమాలోనిదే కాపీ కొట్టారట. ఘరానా మొగుడు సినిమాలోని చిరంజీవి, నగ్మా ల మధ్య వచ్చే మ్యూజిక్, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ నడుచుకుంటూ వస్తుండగా వస్తుంది. ఈరెండు సేమ్ అనే విషయాన్ని చాలా మంది తెలియ‌దు. అయితే మ్యూజిక్ చిరు సినిమా నుంచి తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా చిరు ఘ‌రానా మొగుడు, ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాల‌కు లింక్ కుదిరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news