Newsర‌వితేజ పాట ఎంజాయ్ చేస్తూ బ్రేక్‌పాస్ట్ చేస్తోన్న బాల‌య్య ( వీడియో)

ర‌వితేజ పాట ఎంజాయ్ చేస్తూ బ్రేక్‌పాస్ట్ చేస్తోన్న బాల‌య్య ( వీడియో)

టాలీవుడ్‌లో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బాల‌య్య అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లోనూ క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఈ యేడాది సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బాల‌య్య ఈ ద‌స‌రాకు వ‌చ్చే అక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఈ సినిమా అంతా క్రేజీ కాంబినేష‌న్లోనే వ‌స్తోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు… కాజ‌ల్ హీరోయిన్ కాగా.. శ్రీలీల కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రామ్‌పాల్ బాల‌య్య‌ను ఢీ కొట్టే విల‌న్‌గా క‌నిపిస్తాడు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య బాబి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక బాల‌య్య ఇటు సినిమాలు… అటు రాజ‌కీయాల్లో ఫుల్ బిజీ ఉన్నారు. ఇదిలా ఉంటే బాల‌య్య ప్ర‌స్తుతం షూటింగ్ స్పాట్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని సూర్యాపేటలో ఓ దాబాలో ఆయ‌న బ్రేక్ పాస్ట్ చేస్తూ క‌నిపించారు. ర‌వితేజ ధ‌మాకా సినిమాలోని పాట ఎంజాయ్ చేస్తూ ఆయ‌న బ్రేక్ పాస్ట్ తింటున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news