Movies' పుష్ప 2 ' రివ్యూ ముందే చెప్పేసిన వేణుస్వామి… సినిమా...

‘ పుష్ప 2 ‘ రివ్యూ ముందే చెప్పేసిన వేణుస్వామి… సినిమా హిట్టా… ఫ‌ట్టో తేలిపోయిందిగా..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణిస్వామి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల నిత్యం సోషల్ మీడియాలో వేణుస్వామి పేరు మారుమోగుతుంది. సినిమా సెలబ్రిటీలతో పాటు హీరో.. హీరోయిన్లు అటు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వేణుస్వామి సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ సెల‌బ్రిటీల జాతకాలు చెప్పి వేణుస్వామి ఒక రేంజ్ లో పాపులర్ అయ్యారు.

ఇక నాగచైతన్య – సమంత పెళ్ళికి ముందే వారిద్దరు విడాకులు తీసుకుంటారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పుడు ఆయనపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. చివరకు నిజంగానే నాగచైతన్య – సమంత పెళ్లి చేసుకుని నాలుగేళ్లు కూడా పూర్తిగా నిండ‌కుండానే విడిపోయారు. దీంతో అందరూ వేణుస్వామి జాతకాలను బాగా నమ్మటం మొదలుపెట్టారు.

ఇలా ఎందరో సెలబ్రిటీలు జీవితాల్లో జరిగే విషయాల గురించి ముందే చెబుతూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. వేణుస్వామి కొందరు సినిమా హీరోలు.. హీరోయిన్లు వేణు స్వామితో దోషాపరిహార పూజలు కూడా చేయించుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హీరో ఆది, హీరోయిన్ నిక్కీ గల్రానీ విడిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సంచలనం లేపారు.

అలాగే హీరో అల్లు అర్జున్ జాతకం ఎలా ? ఉందని యాంకర్ అనగా వేణు స్వామి అల్లు అర్జున్ జాతకం అద్భుతంగా ఉందని చెప్పారు. నిజం చెప్పాలంటే తెలుగులో అసలైన పాన్ ఇండియా స్టార్‌ హీరో అల్లు అర్జున్.. ఆయనపై ఒక్క రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయ‌న్నారు.

మరో 10 ఏళ్ల వరకు అల్లు అర్జున్ కు ఎలాంటి డోకా లేదు.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించటం ఖాయం అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పుష్ప 2 సినిమాకు వేణు స్వామి అదిరిపోయే రివ్యూ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news