Moviesఎన్టీఆర్ కు అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పడు కదా "దేవర"లో...

ఎన్టీఆర్ కు అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పడు కదా “దేవర”లో అసలైన మజా వచ్చేది..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా “దేవరా”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చక్క చక్క కంప్లీట్ చేసుకుంటున్నారు టీం . అంతే కాదు ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ “దేవర” ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ సెలెక్ట్ అయింది. రెండో హీరోయిన్గా రష్మిక మందన లేక మృణాల్ ని అనుకుంటున్నారు కొరటాల. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాలో కీలకమైన ఎన్టీఆర్ అత్త పాత్ర కోసం ఏకంగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణను చూస్ చేసుకున్నారట కొరటాల శివ . తారక్ – రమ్యకృష్ణ స్క్రీన్ స్పేస్ ఎంత బాగుంటుందో నా అల్లుడు సినిమా టైంలో మనం చూసాం . వీరిద్దరూ స్క్రీన్ పై కనిపిస్తే రచ్చ రంబోలానే అంటూ ఉంటారు జనాలు. అయితే ఈ సినిమాలో కూడా అత్తగా రమ్యకృష్ణ నటించ బోతుందట . జాన్వికపూర్ కు అమ్మగా ఈ సినిమాలో మనం రమ్యకృష్ణ చూడబోతున్నాం అంటూ తెలుస్తుంది .

అంతేకాదు ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం మలుపు తిప్పేది రమ్యకృష్ణ పాత్రనేనట . అందుకే ఈ సినిమా కోసం రమ్యకృష్ణ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంది . దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ పై సైన్లు కూడా కంప్లీట్ అయ్యాయి అని త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ తెలుస్తుంది . ఏమాటకామాటే తెరపై రమ్యకృష్ణను తారక్ ను భారీ మాస్ డైలాగ్స్ తో చూస్తూ వింటూ ఉంటే ఆ కికే వేరు అంటున్నారు జనాలు . చూద్దాం మరి వీళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ ఎలా రాస్కోస్తాడో కొరటాల శివ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news