Newsతెలుగు స్టేట్స్‌లో దుమ్ములేపిన ' జైల‌ర్‌ ' ... 4 రోజుల్లో...

తెలుగు స్టేట్స్‌లో దుమ్ములేపిన ‘ జైల‌ర్‌ ‘ … 4 రోజుల్లో ర‌జ‌నీ వీర‌విహారం…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ ఈ సినిమా ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకి జోడిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించ‌గా… మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ప్రత్యేక పాత్రలో నటించింది.

తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రు. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రు. 32 కోట్ల గ్రాస్ వసూలు చేయడం జరిగింది. ఈ దూకుడు చూస్తుంటే జైలర్ సినిమా లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

మరోవైపు చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే బోల్తా పడింది. దీంతో జైలర్ దూకుడుకు తిరుగులేకుండా పోయింది. సన్ పిక్చర్స్ పతాకంపై క‌ళానిధి మార‌న్‌ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తెలుగు కమెడియన్ సునీల్, యోగి బాబు, మరో స్టార్ నటుడు మోహన్‌లాల్.. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా కొన్న తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భారీ లాభాలు సొంతం చేసుకోమన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news