Newsఎంతోమంది బ్యూటీస్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన.. రాఘవేంద్రరావు ఫేవరేట్ హీరోయిన్...

ఎంతోమంది బ్యూటీస్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన.. రాఘవేంద్రరావు ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు వస్తూ ఉంటారు ..పోతూ ఉంటారు . కానీ కొందరు మాత్రమే జనాల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు . సినిమా ఇండస్ట్రీలో నాటీ నాటీ సినిమాలు తెరకెక్కించాలి అన్నా.. హీరోయిన్స్ ని అబ్బాయిలు ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా చూపించాలి అన్నా రాఘవేంద్రరావు గారి తర్వాతే మరి ఎవరైనా అని చెప్పాలి. ఇప్పటివరకు రాఘవేంద్రరావు గారు చూపించినట్లు హీరోయిన్స్ ని మరి ఏ డైరెక్టర్ కూడా చూపించలేకపోయాడు అనడంలో సందేహం లేదు .

కాగా తన ఇన్నేళ్ల కెరియర్ లో రాఘవేంద్రరావు ఎంతోమంది హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు .. ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలను తెరపై ఇంకా అందంగా చూపించారు. ప్రతి హీరోయిన్ కూడా రాఘవేందర్రావు డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతూ ఉంటుంది . అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్న.. ఆయన ఎంతోమంది హీరోయిన్స్ తో వర్క్ చేసిన రాఘవేంద్రరావుకి మాత్రం ఫేవరెట్ హీరోయిన్ ఆల్ టైం శ్రీదేవి అంటూ చెప్పుకొచ్చారు .

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాఘవేంద్రరావు ఈ విషయాన్ని బయటపెట్టారు . తను ఎంతోమంది హీరోయిన్స్ తో వర్క్ చేశాను అని ..కానీ ఎక్కువగా ఆయనకు బాగా కంఫర్టబుల్గా అనిపించింది మాత్రం శ్రీదేవిని అంటూ చెప్పుకు వచ్చాడు. అంతేకాదు నగ్మా కూడా ఆయనకు మంచి కంఫర్టబుల్గా వర్క్ చేసిందని చెప్పుకొచ్చారు. నగ్మ అంటే ఆయనకు చాలా చాలా ఇష్టమని చెప్పుకు వచ్చారు. అంతేకాదు ఎక్కువగా డ్యాన్స్ విషయంలో మాత్రం రమ్యకృష్ణను లైక్ చేస్తుంటారట. రమ్యకృష్ణ నడుము తిప్పినట్టు మరి ఏ హీరోయిన్ తిప్పలేదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు . ఇలా రాఘవేందర్రావు తన మనసులోని మాటను ఓపెన్ గానే చెప్పేయడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news