Movies50 ఏళ్ల వ‌య‌స్సులో మ‌హేష్‌బాబు అమ్మ రెండో పెళ్లి…!

50 ఏళ్ల వ‌య‌స్సులో మ‌హేష్‌బాబు అమ్మ రెండో పెళ్లి…!

సీనియర్ నటి సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. సుకన్య అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్. 1991లో ప్రముఖ తమిళ‌ దర్శకుడు భారతీయ రాజా దర్శకత్వం వహించిన పుదినిల్లు పుదునారుతో అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మహానది – చిన్నగౌండర్ – వాల్టర్ వెట్రివేల్ – ఇండియన్ వంటి అనేక విజయవంతమైన సినిమాలలో ఆమె నటించారు.

ముఖ్యంగా తెలుగులో జగపతిబాబు హీరోగా వచ్చిన పెద్దరికం సినిమాలో హీరోయిన్గా నటించి ఇక్కడ బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సాంబ – శ్రీ – మున్నా – అధినాయకుడు శ్రీమంతుడు వంటి సినిమాలలో నటించారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు అమ్మగా జగపతిబాబు భార్య పాత్రలో నటించి మెప్పించారు. ఇక సుకన్య వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2002లో అమెరికా ఎన్నారై శ్రీధ‌ర‌న్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అక్కడ సెటిల్ అయ్యారు.

పెళ్లయిన ఏడాదిలోని భర్తతో తెగతెంపులు చేసుకున్న సుకన్య తిరిగి ఇండియాకు వచ్చి అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె 50 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారంపై స్పందించారు. ఇప్పటివరకు నాకు అలాంటి ఆలోచన లేదు.. ఇప్పుడు నాకు 50 ఏళ్లు.. ఇకపై పెళ్లి, పిల్లలు సంసారం అంటూ పోతే నాకు పుట్టే పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా ? అలాంటి ఆలోచన నా మ‌దిలో మెదులుతోంది అని చెప్పారు.

అయినా ఆమె మరో పెళ్లి వద్దని కానీ.. కావాలని కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక సుకన్య కొన్నేళ్ళ క్రితం వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిందన్న వార్తలు రెండు మూడు సార్లు వినిపించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news