Moviesస్విటీ అనుష్క‌కు ఏమైంది… ఆమె కెరీర్‌ను దెబ్బ కొట్టే పెద్ద రూమ‌ర్…!

స్విటీ అనుష్క‌కు ఏమైంది… ఆమె కెరీర్‌ను దెబ్బ కొట్టే పెద్ద రూమ‌ర్…!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ముదురు ముద్దుగుమ్మ అనుష్క పై ఇప్పుడు ఒక పెద్ద రూమర్ బయట వినిపిస్తోంది. అనుష్క దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో తనకంటే వయసులో చిన్నోడు అయినా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా ఆమె నటిస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో అనుష్కకు హీరో కంటే కాస్త ఎక్కువ వెయిట్ ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇలాంటి సినిమాకు ప్రచారం చేయడానికి అనుష్క ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. గత వారం రోజులుగా నవీన్ ఒక్కడే ప్రచారం మొదలుపెట్టాడు. దీని వెనక ఆసక్తికర కారణం కూడా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా అనుష్క భారీ బరువుతో ఇబ్బంది పడుతోంది. గత కొన్నిళ్ళుగా అనుష్క ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. కనీసం ఈ సినిమా టైమ్ కు అయిన ఆమె స్లిమ్‌ అవుతుందని అంతా భావించారు.

కానీ అలా జరగలేదు.. ఆమె మరింత ఎక్కువగా బరువు పెరిగిపోయిందట. సినిమాలో అయితే గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తారు.. చాలామంది హీరోలు హీరోయిన్లు అలా చేస్తున్నారు. కానీ ప్రమోషన్ల విషయంలో చాలా ఈజీగా దొరికిపోతారు. అందుకే లావెక్కిపోయి బోద్దుగా ఉన్న అనుష్క బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ప్రేక్షకుల్లో అనుష్కకు ఇప్పటికీ క్రేజ్ ఉన్న మాట వాస్తవం అలా అని ప్రచారం చేయకపోతే ఎలా ఇప్పుడు అనుష్క ముందు ఉన్న దారి ఒకటే ఆమె ఎలా ఉన్నా బయటకు రావాల్సిందే లేదంటే ఆమెపై మరిన్ని ఊహాగానాలు చెలరేగటం కాయం. మరి అనుష్క ఇప్పుడు అయినా బయటికి వస్తుందో లేదో చూడాలి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news