Movies"అక్క అంటూ ప్రైవేట్ పార్ట్ నొక్కాడు"..దుల్కర్ కూడా అంతే..కస్తూరి సెన్సేషనల్ కామెంట్స్...

“అక్క అంటూ ప్రైవేట్ పార్ట్ నొక్కాడు”..దుల్కర్ కూడా అంతే..కస్తూరి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

ఫ్యాన్స్ అంటూ కొంతమంది ఆకతాయిలు అమ్మాయిలు కనిపిస్తే ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఇలాంటి సిచువేషన్ ని ఫేస్ చేశారు. మరీ ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ కి వెళ్ళిన షాప్ ఓపెనింగ్ చేయడానికి మాల్స్ కు వెళ్లిన . ఈవెంట్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫర్ అంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు . ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై టచ్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు.

కాగా అదే విషయాన్ని మరోసారి బయటపెట్టింది గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి. అన్నమయ్య సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటించిన కస్తూరి ప్రజెంట్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది. కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బయట పెట్టింది. ” ఓ రోజు కోలీవుడ్ స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్ కు రమ్మని నాకు పిలుపు వచ్చిందని ..ఈవెంట్ అయిపోయాక వస్తున్న టైం లో ఓ వ్యక్తి నా బ్యాక్ పై చేయి వేసి నొక్కుతున్నట్లు అనిపించిందని.. అప్పుడే మా నాన్న పక్కనే ఉన్నాడని దీంతో చేయి పట్టుకుని ముందుకు లాగితే.. ఆ అబ్బాయి చాలా చిన్నవాడని ..దీంతో నా కోపం చూసి అక్క సారీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు అని చెప్పుకొచ్చింది”.

“అంతేకాదు ఇలాంటి చెత్త పనులు చేసి దొరికిపోయి అక్కా అని పిలవడం ఏంటి..? అసలు ఇలాంటి పనులు ఎందుకు చేయాలి ..? ఎందుకు ఏడవాలి..?” అంటూ ఫైర్ అయింది. అంతేకాదు రీసెంట్గా ఇదే విషయాన్ని దుల్కర్ సల్మాన్ సైతం చెప్పుకొచ్చాడు. తనని ఓ అభిమాని ఇబ్బంది పెట్టిందని ముద్దు పెట్టడానికి పైపైకి వచ్చిందని .. మరో అభిమాని ఆసభ్యకరంగా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చాడు . నాకు కూడా అలాగే జరిగింది అని కస్తూరి దుల్కర్ సల్మాన్ కామెంట్స్ ని బేస్ చేసుకుని తన బ్యాడ్ ఇన్సిడెంట్ ని బయటపెట్టింది. ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news