Newsర‌జ‌నీకాంత్ ' జైల‌ర్ ' సూప‌ర్‌హిట్‌... ఎన్టీఆర్ ' దేవ‌ర‌ '...

ర‌జ‌నీకాంత్ ‘ జైల‌ర్ ‘ సూప‌ర్‌హిట్‌… ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ కు క‌లిసొస్తుందా…!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన‌ జైలర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఏకంగా రు. 140 కోట్ల గ్రాస్ వసూళ్లు రావటం అంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళనాట‌ ఒక ఊపు ఊపుతోంది.

ఈ సినిమా విజయంలో నెల్సన్, రజనీకాంత్ ఎంత కష్టపడ్డారో అలాగే ఈ సినిమా రేంజ్ ను బాగా ఎలివేట్ చేసిన క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ దక్కుతుంది. చాలా చోట్ల స్లో సన్నివేశాలను కూడా అనిరుధ్‌ తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేశాడని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అయితే ఇప్పుడు జైలర్ సినిమా చూసిన వాళ్లంతా కూడా అనిరుధ్‌ తెలుగులో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవరపై భారీ అంచనాలతో ఉన్నారు.

ఇప్పటికే దేవర మోషన్ పోస్టర్ టీజర్ కి అనిరుధ్‌ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ లాంటి వీర‌మాస్ హీరోకు, కొర‌టాల యాక్ష‌న్ సీన్లు.. అనిరుధ్ బీజీఎం తోడు అయితే థియేట‌ర్ల‌లో పూన‌కాల మోత ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమా వ‌చ్చే ఏప్రిల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news