Newsవిజ‌య్ ' లియో ' వ‌ర‌ల్డ్‌వైడ్ బిజినెస్‌... ఇది సెన్షేష‌న‌ల్ రికార్డ్‌...!

విజ‌య్ ‘ లియో ‘ వ‌ర‌ల్డ్‌వైడ్ బిజినెస్‌… ఇది సెన్షేష‌న‌ల్ రికార్డ్‌…!

ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి భారీ అంచనాలు ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య‌ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లియో సినిమా ఒకటి. త్రిష హీరోయిన్గా.. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి సెన్సేషనల్ హైప్‌తో దూసుకుపోతోంది. 20 సంవత్సరాల క్రితం విజయ్ – త్రిష కాంబినేషన్ అంటే కోలీవుడ్లో తిరుగులేని క్రేజ్ ఉండేది.

మళ్లీ ఆ కాంబినేషన్ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రిపీట్ అవుతుండడంతో లియోపై మామూలు అంచనాలు లేవు. దీనికి తోడు ఉలగనాయకన్‌ కమలహాసన్ తో విక్రమ్ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తెరకెక్కించిన లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావటం కూడా లియోకు కలిసి వస్తోంది. ఇక లియో సినిమా అప్పుడే కోలీవుడ్ హిస్టరీలోనే ఓ ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా అన్ని భాషలు.. అన్ని ఏరియాలో థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ హక్కులు కలిపి ఏకంగా రు. 400 కోట్ల పైచిలుకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ చరిత్రలోనే ఇది ఆల్ టైం రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news