Newsబిగ్ రిస్క్ చేస్తున్న దిల్ రాజు.. ఆ కొరియోగ్రాఫర్ తో హీరోగా...

బిగ్ రిస్క్ చేస్తున్న దిల్ రాజు.. ఆ కొరియోగ్రాఫర్ తో హీరోగా సినిమా నా..? ఎవ్వడైన చూస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రయోగాలు చేస్తున్న స్టార్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అప్పటివరకు నార్మల్ కథలను చూస్ చేసుకునే హీరోలు కూడా ఒక్కసారిగా భారీ రిస్క్ తీసుకుని టఫ్ పాత్రను చూస్ చేసుకొని డు ఆర్ డై అనే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. అదే లిస్ట్ లోక్ ముందు ప్లేస్ లో ఉంటాడు దిల్ రాజు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద బిగ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు ఎప్పుడు ముందుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే .

కొత్త కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడానికి ఎప్పటికప్పుడు తాపత్రయ పడుతూనే ఉంటారు దిల్ రాజు. కాగ కొత్త వాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దిల్ రాజు రీసెంట్గా భారీ రిస్క్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న యాష్ మాస్టర్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు .

ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరించబోతున్నారు . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . “ఆకాశం దాటి వస్తావా” అనే పేరుని ఈ సినిమా కోసం ఖరారు చేసుకున్నారు. కాగా శశికుమార్ ముత్తులూరి దర్శకుడుగా ఈ సినిమా చేస్తుండగా గాయకుడు కార్తిక్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ క్రమంలోని దిల్ రాజు మాట్లాడుతూ ..”ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్పారు. దర్శకుడు శశి తన జీవితంలో జరిగిన విషయాలనే కథగా రాసుకున్నారన్నారు. ఈ చిత్రానికి సంగీతం బలమని, కార్తీక్ అన్ని పాటలూ అద్భుతంగా చేశార‌న్నారు. బ‌ల‌గం సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఈ సినిమా గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింద‌ని..ఇప్పుడు ఫైఅనలైజ్ అయ్యిందని “చెప్పుకొచ్చారు. దీంతో ఇండస్ట్రీలో ఇంతమంది ఉంటే కొత్త హీరో వచ్చి ఏం పీకుతాడు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news