Moviesఅబ్బబ్బా..ఏం లక్ రా బాబు.. పాన్ ఇండియా ఆఫర్ పట్టేసిన కృతిశెట్టి.....

అబ్బబ్బా..ఏం లక్ రా బాబు.. పాన్ ఇండియా ఆఫర్ పట్టేసిన కృతిశెట్టి.. హీరో ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి మరో బిగ్ ఆఫర్ అందుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. కాగా ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ పడక అల్లాడిపోతున్న కృతి శెట్టి .. హిట్ కొట్టకపోయిన సరే అవకాశాలు వెతుక్కుంటూ కృతిశెట్టి గుమ్మం వైపు వస్తున్నాయి . దానికి రీజన్ అందం అనే చెప్పాలి . చూడడానికి చాలా చిన్నదైనా సరే చాలా అట్రాక్టివ్ గా ఉండడం ..ఆమెకు ప్లస్ పాయింట్ .

అంతేకాదు డైరెక్టర్ మేకర్స్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సాఫీగా షూటింగ్ పనులు పూర్తి చేయడంలో కృతిశెట్టి చాలా ముందు వరుసలో ఉంటుంది . అందుకే మేకర్స్ హిట్ కొట్టకపోయినా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు . కాగా ఇదే క్రమంలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ . కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న జీని సినిమాలో కృతి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది .

ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది . ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇందులో కృతిశేట్టి గ్రీన్ కలర్ సారీ.. సిల్వర్ కలర్ బ్లౌజులు చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. కృతి శెట్టితో పాటు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, వామికా గ‌బ్బి కూడా హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఒకప్పటి హీరోయిన్ దేవ‌యాని కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. అర్జున‌న్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై డా ఐస‌రి, కె గ‌ణేష్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news