Moviesనాని చేసిన పనికి బోరున ఏడ్చేసిన సాయి పల్లవి.. షూటింగ్ సాకుతో...

నాని చేసిన పనికి బోరున ఏడ్చేసిన సాయి పల్లవి.. షూటింగ్ సాకుతో ఇలా కూడా చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉండే స్టార్ హీరోలు కూడా కొన్నిసార్లు గొడవలు పడుతుంటారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సైలెంట్ హీరోలు కూడా కొన్ని సార్లు టెంపర్ లాస్ అవుతూ ఉంటారు. సైలెంట్ హీరో అని అనగానే అందరికీ గుర్తొచ్చేది మహేష్ బాబు ..ఆ తర్వాత అందరు మదిలో బ్లింక్ అయ్యే పేరు మాత్రం నాచురల్ స్టార్ నాని అనే చెప్పాలి. కాంట్రవర్షియల్ కంటెంట్ జోలికి వెళ్లకుండా.. గొడవలకు అస్సలు పోకుండా ..తన పని తాను చూసుకునే వాళ్ళల్లో మహేష్ బాబు తర్వాత నేచురల్ స్టార్ నాని సెకండ్ ప్లేస్ లో ఉంటారు .

అయితే అటువంటి నేచురల్ స్టార్ నాని చేసిన బిహేవియర్ కారణంగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హార్ట్ అయిందని.. షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది అన్న వార్త అప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది . కాగా నేచురల్ స్టార్ నాని సాయి పల్లవి కలిసి రెండు సినిమాల్లో నటించారు . ఒకటి ఎంసీఏ .. మరొకటి శ్యామ్ సింగరాయ్. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ హిట్ నమోదు చేసుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా కూడా మారిపోయారు . కాగా ఎంసీఏ సినిమా షూటింగ్ లో భాగంగా సాయి పల్లవికి నాని మాట్లాడే తీరు అస్సలు నచ్చలేదట.

వీళ్లిద్దరి కాంబోలో ఫస్ట్ సినిమా అదే కావడంతో సాయి పల్లవి అప్పటి వరకు పనిచేసిన హీరోలు అందరూ చాలా కూల్ గా పద్ధతిగా మాట్లాడటంతో సాయి పల్లవి ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరూ అలానే ఉంటారు అంటూ ఫిక్స్ అయిపోయిందట . అయితే నాచురల్ స్టార్ నాని కూసింత రాసుకొని పూసుకొని ఉండేటటువంటి మనిషి. సరదా సరదాగా జోక్స్ వేస్తూ సెట్లో పండగ వాతావరణం తీసుకొస్తాడు . అయితే సాయి పల్లవి పై నాని జోక్స్ అప్పట్లో సాయి పల్లవికి నచ్చలేదట .

సాయి పల్లవి ముఖంపై మొటిమలను టార్గెట్గా చేసుకొని నాని సరదాగా ఆమెకు పంచెస్ వేసాడట. దీంతో సాయి పల్లవి హార్ట్ అయ్యి ఎంసీఏ షూటింగ్ నుంచి వెళ్ళిపోయిందట . అయితే రంగంలోకి దిగిన దిల్ రాజు నాని క్యారెక్టర్ అది కాదని నచ్చజెప్పి.. కూల్ చేసి ..మళ్ళీ సాయి పల్లవి తో మాట్లాడించారట . నాని సాయి పల్లవికి సారీ కూడా చెప్పారట . ఆ తర్వాత వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు . అంతేకాదు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా చూస్ చేసుకుంది కూడా నానినే. ఏది ఏమైనా సరే మొదట గొడవ పడిన తర్వాత ఫ్రెండ్షిప్ గా మారితే ఆ ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నది నాని సాయి పల్లవి మేటర్ లో మరోసారి ప్రూవ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news