Movies"భోళా శంకర్" సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోని చిరంజీవి..ఎందుకో...

“భోళా శంకర్” సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోని చిరంజీవి..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భోళా శంకర్ . వరుస ఫ్లాప్ సినిమాల తో కొట్టుమిట్టాడుతున్న డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఫుల్ సిస్టర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .


ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తూ ఉండగా ..చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ ..ఆమెకు భర్త పాత్రలో యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నారు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలవబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా కోసం చిరంజీవి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది. ఎస్ చిరంజీవి ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట . అయితే రిలీజ్ అయ్యాక లాభాల్లో మాత్రం వాట తీసుకుంటానని మెహర్ రమేష్ కి ముందే చెప్పారట . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . చిరంజీవి తీసుకున్న నిర్ణయం మంచిదే అంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో..? ఎలాంటి కలెక్షన్ లు సాధిస్తుందో .. చిరంజీవికి షేర్ ఎంత వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news