Moviesబాల‌య్య - బాబి సినిమా స్టోరీ ఇదే.. కెరీర్‌లో న‌ట‌సింహం ఫ‌స్ట్...

బాల‌య్య – బాబి సినిమా స్టోరీ ఇదే.. కెరీర్‌లో న‌ట‌సింహం ఫ‌స్ట్ టైం ఇలా…!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాల‌య్య కెరీర్‌లో 109వ సినిమాగా ఇది తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం బాల‌య్య న‌టిస్తోన్న భ‌గ‌వంత్ కేస‌రి సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంట‌నే ఇది సెట్స్ మీద‌కు వెళుతుంది. ఇక ఈ సినిమా గురించి మరో అదిరిపోయే అప్ డేట్ వినిపిస్తోంది

ఈ సినిమా బాలయ్య మార్క్ కంప్లీట్ యాక్షన్ డ్రామా కాద‌ట‌.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే.. సినిమాలో యాక్షన్ కన్నా.. ఫ్యామిలీ ఎమోషన్సే ఎక్కువ ఉంటాయని.. ద‌ర్శ‌కుడు బాబి అలాగే స్టోరీ రెడీ చేసుకున్నార‌ని.. పైగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని స‌మాచారం.

ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండేలా ద‌ర్శ‌కుడు బాబి స్టోరీ రెడీ చేసుకున్నాడ‌ట‌. ఈ సినిమా కథలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడట ద‌ర్శ‌కుడు. బాలయ్య ఇలా కంప్లీట్ ఎమోష‌న‌ల్ రోల్లో న‌టించ‌డం ఇదే ఫ‌స్ట్ టైం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

ఓవ‌రాల్‌గా ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తే మాత్రం భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాని…ఓల్డ్ గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని లీకులు వ‌స్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సూర్య‌దేవ‌ర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news