Moviesఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉన్నా..ప్రభాస్ నే ఓం రావత్ రాముడిగా...

ఇండస్ట్రీలో అంత మంది హీరోలు ఉన్నా..ప్రభాస్ నే ఓం రావత్ రాముడిగా ఎందుకు చూస్ చేసుకున్నాడో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో ..ఎక్కడ చూసినా సరే హీరో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకోవడమే కాకుండా రెండు రోజుల్లోనే 240 కోట్లు కొల్లగొట్టి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది . కాగ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ఓం రావత్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉండగా రాముడి పాత్రకు కేవలం ప్రభాస్ నే ఎందుకు చూస్ చేసుకున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఇదే ప్రశ్నకు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇస్తూ..ఓం రావత్ క్లారిటీ ఇచ్చాడు.

“ప్రభాస్ కళ్ళల్లో తెలియని మ్యాజిక్ ఉందని ..ఆయన కళ్ళు చూస్తేనే అట్రాక్ట్ అయిపోతామని.. ఆయన కళ్ళు చూసే నేను ఈ సినిమాలో రాముడి పాత్రకి సెలెక్ట్ చేశానని.. ఎటువంటి కల్మషం లేకుండా.. ప్రేమను స్వచ్చంగా పలికించడంలో ప్రభాస్ కళ్ళు నాకు చాలా నచ్చాయని ..అందుకే నేను రాముడు పాత్రలో ప్రభాస్ ని ఎంచుకున్నాను “అని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఏ మాటకు ఆ మాట నిజంగానే రాముడు గెటప్ లో ప్రభాస్ అదిరిపోయాడు . ఇప్పుడు ఎవరికైనా సరే రాముడు అనగానే అందరికీ ప్రభాసే గుర్తు వస్తాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news