Moviesప్రాణ స్నేహితుల్లా ఉన్న రాకేష్- శేఖర్ మాస్టర్ ..విడిపోవడానికి కారణం ఆ...

ప్రాణ స్నేహితుల్లా ఉన్న రాకేష్- శేఖర్ మాస్టర్ ..విడిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనా..?

ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మరణించారు. యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ కోసం వరుసగా తిరుగుతూ ఉండటం.. ఎండ తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బ తగలడం.. దాని కారణంగా రక్త విరోచనాలు అవ్వడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు . ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ ప్రముఖులు ఆయన ఫ్యాన్స్ ఆయనకు నివాళులర్పిస్తున్నారు .

కాగా ఇదే మూమెంట్లో ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా గురు శిష్యులుగా పాపులారిటీ సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ – శేఖర్ మాస్టర్ ఎందుకు విడిపోయారు.. వాళ్ళు మధ్య గొడవ రావడానికి కారణం ఏమిటి ..అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా మనందరికీ తెలిసిందే రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు.

=అయితే ఒకప్పుడు ఒక పూట తిండి కి కూడా ఇబ్బంది పడే శేఖర్ మాస్టర్ ని రాకేష్ మాస్టర్ ఈ స్థాయికి తీసుకొచ్చాడు అన్న కామెంట్లు కూడా వినపడుతూ ఉన్నాయి. అయితే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారట . ఎవరు సీక్రెట్ దాచకూడదని ఓపెన్గా చెప్పుకు రావాలని ప్రామిస్ చేసుకున్నారట . అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాలో రెండు పాటలకు డాన్స్ చేసే అవకాశం వస్తే శేఖర్ మాస్టర్ ..రాకేష్ మాస్టర్ దగ్గర ఆ విషయం దాచిపెట్టడని ..అప్పటినుంచి ఆయనంటే నమ్మకం పోయిందని ..రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

అంతే కాదు తన భార్య కూడా నన్ను శత్రువులా చూస్తుంది అంటూ నేను చచ్చిపోతే నా శవాన్ని కూడా వాళ్ళు తాకకూడదు అంటూ కండిషన్ పెట్టాడు . ఆయన చనిపోవడంతో మరోసారి ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి . అయితే అప్పట్లోనే శేఖర్ మాస్టర్ దానిపై క్లారిటీ ఇచ్చాడు . నాకు అప్పటికే ఆ పాటలు కన్ఫర్మ్ కాలేదని ..అందుకే చెప్పలేదని ..ఆయనకు దగ్గర డాన్స్ నేర్చుకున్న రుణం నేనెప్పటికీ తీర్చుకోలేనని.. కానీ ఆఫర్స్ విషయంలో ఎవరి కష్టం వాళ్ళదని.. తాగేసి మా అమ్మని తప్పుగా మాట్లాడాడు.. అని నా భార్యకు కాల్ చేసి అసభ్యకరంగా తిట్టాడు అని చెప్పుకొచ్చాడు. రాకేష్ మాస్టర్ చనిపోవడంతో మరోసారి శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మధ్య ఉన్న గొడవ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news