Moviesఎన్టీఆర్ సినిమాలో విలన్ గా స్టార్ హీరో భార్య.. ఈ ఒక్క...

ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా స్టార్ హీరో భార్య.. ఈ ఒక్క దెబ్బకి సినీ రికార్డులు తుక్కు తుక్కు అయిపోవాల్సిందే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమాలో నటిస్తున్న తారక్..ఆ తరువాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . కాగా “సల్లార్” సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ సినిమాకి సంబంధించిన పనులను ప్రారంభించడానికి రెడీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్.

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరో టాలీవుడ్ స్టార్ హీరోని కూడా జత కలపబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నా బాలీవు ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది .

అంతేనా ఈ సినిమాలో విలన్ గా మరో లేడీ ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఒకవేళ అదే నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఇది కని విని ఎరుగని రికార్డుగా మిగిలిపోతుంది. ఓ టాలీవుడ్ హీరో కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ..విలన్ గా మారడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ విలన్ గా మారబోతుంది అంటూ ఇప్పటికే ప్రచారం మొదలైపోయింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news