Moviesఓం రౌత్‌పై సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ సెటైర్లు..పబ్లిక్ లోనే అంత...

ఓం రౌత్‌పై సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ సెటైర్లు..పబ్లిక్ లోనే అంత మాట అనేశాడు ఏంట్రా బాబు(వీడియో) వైరల్‌..!!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ ఎలా హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ గురవుతున్నారో సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అంతకుముందు తెలుగు వాళ్ళకి ఓం రావత్ పేరు తెలియదు . ఆది పురుష్ పుణ్యమా అంటూ ఆయన పేరు తెలుగు సోషల్ మీడియాలో సైతం ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ చేత ఆది పురుష్ సినిమా చేయించి ఇండస్ట్రీలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన ఓంరావత్ .

ఈ సినిమాతో 450 కోట్లు కలెక్ట్ చేసి సినిమాలను ప్రాఫిట్ లోకి తీసుకొచ్చినా..టాక్ పరంగా మాత్రం నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి . అయితే ఇలాంటి క్రమంలోనే త్వరలో ప్రభాస్ నటించిన సినిమా మరొకటి కూడా రిలీజ్ కాబోతుంది . కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది .

ఆ వీడియోలో ఓం రావత్ ని టార్గెట్ చేసిన వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. మీడియాతో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సలార్ సినిమా గురించి ఓపెన్ గా చెప్పుకు వచ్చారు . కొందరు సీజీలో పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు . కానీ మేము అలా కాదు దుమ్ములోనే చేస్తాం అంటూ ఘాటుగా స్పందించారు . అయితే ఈ వ్యాఖ్యలు ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓం రావత్ పైన చేశారు అంటూ పలువురు మరింత రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ పరోక్షంగా ఓం రావత్ పై వేసిన కౌంటర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news