Moviesఆ స్పెషల్ డేనే ఉపాస‌నకి డెలివ‌రీ .. భార్య కోసం రామ్...

ఆ స్పెషల్ డేనే ఉపాస‌నకి డెలివ‌రీ .. భార్య కోసం రామ్ చ‌ర‌ణ్ ఏం చేస్తున్నాడో తెలిస్తే..హ్యాట్సాఫ్ అనాల్సిందే ..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా కోడలు ఉపాసన డెలివరి గురించే చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు మెగా కోడలు ఉపాసన గర్భం దాల్చలేదే అంటూ ఆమెను ట్రోల్ చేశారు . ఎట్టకేలకు పెళ్లయిన పదేళ్లకి ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది . అయితే దీనికోసం మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి నెల నుంచి ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా చూసుకుని ఆమె కడుపులోని బిడ్డను హెల్తీగా పెంచడానికి ట్రై చేస్తున్నారు . కాగా ఎట్టకేలకు ఉపాసన డెలివరీ డేట్ లాక్ అయిపోయింది . వచ్చే నెలలోనే ఉపాసన పండు లాంటి పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతుంది.

ఈ క్రమంలోనే ఉపాసన డెలివరీ కోసం సర్వం సిద్ధం చేశాడట రామ్ చరణ్ . అంతే కాదు ఆమె కోసం అమెరికాలో డెలివరీ చేయించాలి అనుకున్న రాంచరణ్ ఉపాసన తన సొంత హాస్పిటల్స్ అపోలోనే డెలివరీ చేయించుకుంటాను అని మొండి పట్టుదల పట్టడంతో ఆమె ఇష్ట ప్రకారమే అపోలో హాస్పిటల్ డెలివరీ చేయించుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు ఉపాసన డెలివరీ కోసం ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం బ్లాక్ చేసేసాడు రామ్ చరణ్ . ఉపాసన డెలివరీ అయిన తర్వాత అక్కడ ఎవరు కనిపించకూడదని ..కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండేలా మొత్తం సెట్ చేశారట .

అంతే కాదు విజిటర్స్ ని ఎవర్ని కూడా అలోవ్ చేయరట . ఆ రూట్ కూడా వేరే మార్గంలో వెళ్లేటట్టు ప్లాన్ చేశారట . అంతేకాదు ఉపాసన ఏ హాస్పిటల్ అయితే డెలివరీ అవుతుందో ఆ హాస్పిటల్ లో ఆ బ్లాక్ మొత్తం ఎవరైతే స్టాఫ్ ఉండబోతున్నారో వాళ్ళందరికీ ముందుగానే కరోనా పరీక్షలు చేయించి సర్వం సిద్ధం చేయబోతున్నారట . అంతేకాకుండా మెగా ఫ్యామిలీ ఉపాసన డెలివరీ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు చేయిస్తుందట . దీనికోసం సర్వం సిద్ధం చేసుకుంది మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఉపాసన ప్రసవం కోసం మెగా ఫ్యామిలీ తీసుకుంటున్న కేరింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు అందరికీ ఇలాంటి అత్తమామలు భర్త దొరకాలని కోరుకుంటున్నారు అమ్మాయిలు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉపాసన డెలివరీ పై హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి . కొందరు పాప పుడుతుంది అంటుంటే మరికొందరు లేదు లేదు బుల్లి రామ్ చరణ్ రాబోతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే మీరేమనుకుంటున్నారు ఉపాసనకి పాప పడుతుందా..? లేక బాబు పుడతాడా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news