Moviesపోలిస్ స్టేషన్ లో మెగా హీరోయిన్.. అయ్యయ్యో.. ఒక్క సిసిటీవి ఫుటేజ్...

పోలిస్ స్టేషన్ లో మెగా హీరోయిన్.. అయ్యయ్యో.. ఒక్క సిసిటీవి ఫుటేజ్ తో అడ్డంగా బుక్కైపోయిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న డింపుల్ హయాతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో యమ ట్రెండింగా మారింది . మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ హయాతి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది . తెలుగమ్మాయి అయినా సరే పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది . రవితేజతోఖిలాడి ..రీసెంట్గా గోపీచంద్ తో రామబాణం సినిమాలో నటించి పాపులారిటి సంపాదించుకున్న డింపుల్ హయాతికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

హీరోయిన్ డింపుల్ హయాతి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది . దానికి కారణం ఆమె రాష్ బిహేవియర్ అనే తెలుస్తుంది . జర్నలిస్టు కాలనీలోని హుడా ఎంక్లేవ్ లో డింపుల్ హయాతి ఉంటున్నారు .ఆమెతో పాటు డేవిడ్ అనే అతను కూడా బస చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఆ అంతస్తులో ట్రాఫిక్ డిసిపి ఐపిఎస్ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. కార్ పార్కింగ్ విషయంలో డింపుల్ హయాతి ప్రవర్తన పై విసుకు చెందిన రాహుల్ ఏకంగా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు . అపార్ట్మెంట్స్ ఏరియాలో పక్క పక్కనే కార్ పార్క్ చేసుకుంటున్నారు రాహుల్ – డింపుల్ హయాతి . ఈ క్రమంలోనే డింపుల్ రెచ్చిపోయి ఆయన వాహనాన్ని ఢీ కొట్టినట్లు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలిసింది .

ఈ క్రమంలోనే ఈనెల 14న పార్క్ చేసి ఉన్న డి సి పి వాహనాన్ని తన కారుతో డింపుల్ హయాతి దారుణంగా ఢీకొట్టారు . ఈ సీన్స్ సిసిటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి . దీని ఆధారంగా కార్ డ్రైవర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు . ఈ క్రమంలోనే డింపుల్ హయాతి పై 353 , 341 , 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు . ఆ తర్వాత 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు . త్వరలోనే దీనిపై మరో విచారణ కూడా చేపట్టబోతున్నారు .ఏది ఏమైనా సరే డింపుల్ హయాతి ఓ పక్క సినిమాలో హీరోయిన్గా సక్సెస్ అవడం కోసం నాన్న తండాలు పడుతుంటే ..ఇలా రాష్ బిహేవియర్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంత జరిగాక డింపుల్ హయాతి ని తెలుగు జనాలు యాక్సెప్ట్ చేయరు అంటూ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. చూడాలి దీనిపై డింపుల్ హయాతి ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news