Newsపవన్ సినిమాకి అలాంటి కండీషన్..? ఈ హీరోయిన్ కి అంత హెడ్...

పవన్ సినిమాకి అలాంటి కండీషన్..? ఈ హీరోయిన్ కి అంత హెడ్ వెయిటా..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ హీరోలు ఉన్న కుర్ర హీరోలు ఉన్నా.. ఎన్నో అవార్డులు గెల్చుకుంటున్న ..ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే జనాలలో తెలియని వైబ్రేషన్స్ పూనకాలు వచ్చేస్తాయి. ఆఫ్ కోర్స్ ఆ పేరులోనే ఆ తెలియని కిక్కు ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే ..మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు . తనదైఅన్ స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు . ఈ క్రమంలోని 2024 ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వకముందే తన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలోనే సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు . ఇదే క్రమంలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా అవకాశం వస్తే మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ రిజెక్ట్ చేసింది అన్న పాత్ర ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఎవరైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వస్తే వదులుకుంటారా..? బుద్ధున్న ఎవరు ఆ పని చేయరు.. అయితే మాళవిక మోహనన్ ఎందుకు వదులుకుంది.. అన్నది ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే క్యారెక్టర్ పరంగా ఆమెకి అంతగా స్పైసీగా అనిపించలేదని.. స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగా ఉందని.. మరీ ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ అయినా సరే పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకుని సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయని ఈ కారణంగానే అమ్మడు ఈ పాత్ర రిజెక్ట్ చేసిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు స్క్రీన్ స్పేస్ పెంచమని డైరెక్టర్ కి కండీషన్ పెట్టిందట. డైరెక్టర్ అందుకు నో చెప్పడంతో..అమ్మడు ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఏది ఏమైనా సరే కోరి వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకొని మాళవిక మోహనన్ తప్పు చేసింది అంటున్నారు పవన్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోని ఈ పాత్రలో శ్రీలీల ఫిక్స్ అయినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news