Moviesగుండెపోటుతో ఆసుప‌త్రిలో చ‌లాకీ చంటి... అంతా టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌...!

గుండెపోటుతో ఆసుప‌త్రిలో చ‌లాకీ చంటి… అంతా టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌…!

ప్రముఖ కమెడియన్, నటుడు చలాకి చంటి గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈనెల 21వ తేదీన చంటికి గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చంటి ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు గుండెపోటు వచ్చినట్టు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.

చంటి గుండెలో రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు పరీక్షల్లో తేలడంతో డాక్టర్లు హుటాహుటిన స్టంట్ వేశారు.
చంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా చంటి ఆరోగ్య పరిస్థితిపై ఒక వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అయితే ఇంకా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే చంటి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోవడం మాత్రం కాస్త ఆయన అభిమానులను.. జబర్దస్త్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. చంటి ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులు లేదా వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అందరూ కోరుతున్నారు.

ఇక జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చలాకీ చంటి. తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే స్కిట్లు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఒక్క షో తోనే లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే బిగ్ బాస్ ఆరో సీజన్లో పాల్గొన్నారు. గ‌త కొంత కాలంగా చంటి వెండితెర‌పై, ఇటు బుల్లితెర‌పై క‌న‌ప‌డ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news