Moviesపొన్నియిన్ సెల్వన్ 2: ఐశ్వర్య రాయ్ పాత్ర మిస్ చేసుకున్న ఆ...

పొన్నియిన్ సెల్వన్ 2: ఐశ్వర్య రాయ్ పాత్ర మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి ఫెలో ఎవరో తెలుసా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా పోనియన్ సెల్వన్ 2 పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పోనియన్ సెల్వన్ 2 హ్యూజ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. గత ఏడాది పోనియన్ సెల్వన్ 1 సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన పార్ట్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ని తమిళ బాహుబలి గా చెప్పుకొస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే ఈ సినిమా కి హైలైట్ గా నిలిచింది ఐశ్వర్యరాయ్ పాత్ర . మొదటి నుంచి ఏ పాత్ర తీసుకున్న జీవించి నటించే ఐశ్వర్యారాయ్.. ఈ సినిమాలో ఒదిగిపోయి నటించింది .

పార్ట్ వన్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనుకున్న ఐశ్వర్యారాయ్ పాత్ర పార్ట్ 2 వచ్చేసరికి ఐశ్వర్యారాయ్ అసలు క్యారెక్టర్ బయటపడింది . అయితే నిజానికి ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అనుకున్న మొదట హీరోయిన్ నయనతార అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ కథను ఒక వివరించగా నయన్ ఇన్ని కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేను అంటూ హ్యాండ్ ఇచ్చిందట . ఈ క్రమంలోనే తన లక్కీ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ని మణిరత్నం ఫిక్స్ చేసుకున్నాడు .

కాగా ఈ సినిమా చూసిన తర్వాత ఐశ్వర్యరాయ్ పాత్రలో మరి ఏ హీరోయిన్ ని ఊహించుకోలేనంత స్థాయిలో నటించేసింది. ఐశ్వర్యారాయ్ పొనియన్ సెల్వన్ 2 సినిమాకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాప్ రేంజ్ లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news