Moviesఅనుష్క కు పెళ్లి అయితే జరిగేది అదే..? జాతకంలో అతి పెద్ద...

అనుష్క కు పెళ్లి అయితే జరిగేది అదే..? జాతకంలో అతి పెద్ద దోషం ఉందా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మేల్ అనగానే గుర్తొచ్చేది ప్రభాస్ . అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అనుష్క శెట్టి . పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నాగార్జున హీరోగా నటించిన సూపర్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ లు అని సంబంధం లేకుండా .. వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలకు కంటెంట్ లేని సినిమాలకు యాక్సెప్ట్ చేస్తూ .. తనదైన స్టైల్ లో నటించి హిట్లు ప్లాప్ లు రెండు తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత అరుంధతి సినిమాతో టాలీవుడ్ జేజమ్మగా మారిపోయిన అనుష్క .. ప్రెసెంట్ నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా లో నటిస్తుంది. ఆశ్చర్య ఏంటంటే ఇందులో అనుష్క ఆంటీ రోల్ లో నటించబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది .

కాగా సినిమాలపరంగా ఎలా ఉన్న అనుష్క పెళ్లి గురించి ఎప్పుడు న్యూస్లు వినిపిస్తూనే ఉంటాయి . కాగా రీసెంట్గా అనుష్క జాతకంలో దోషం ఉందని .. ఆ దోషం కారణంగానే పెళ్లి జరగట్లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే అది చిన్నదోషం కాదని .. పరిహారాలు చేసిన సరే అనుష్క జీవితంలో కోలుకోలేని దెబ్బ తినాల్సి వస్తుందని.. ఆ కారణంగానే ఇది తెలుసుకున్న అనుష్క తన లైఫ్ లోకి వచ్చే అబ్బాయి కూడా హ్యాపీగా ఉండాలి అని.. నా వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అంటూ పెళ్లిని ఆపేసుకుందట . దీంతో ఫ్యాన్స్ సైతం బాధ పడిపోతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అనుష్క ఫ్యాన్స్ మాత్రం చాలా డిప్రెషన్ కి గురై పోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news