MoviesVanisri-VijayaNirmala రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొట్టుకోబోయిన వాణిశ్రీ - విజ‌య‌నిర్మ‌ల‌… అస‌లేం ఏం...

Vanisri-VijayaNirmala రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొట్టుకోబోయిన వాణిశ్రీ – విజ‌య‌నిర్మ‌ల‌… అస‌లేం ఏం జ‌రిగింది…!

వాణిశ్రీ- విజ‌య‌నిర్మ‌ల‌.. ఇద్ద‌రూ కూడా తెలుగు వెండి తెర‌పై త‌న‌దైన శైలిలో ప్ర‌భావం చూపించిన వారే. ఎవ‌రికి ఎవ‌రూ తీసుపోరు. ఎవ‌రికి ఎవ‌రూ తక్కువ కారు. ఎవ‌రి స్ట‌యిల్ వారిది. విజ‌య‌నిర్మ‌ల‌.. బ‌హుముఖ కోణంలో ముందుకు సాగారు. ఇక‌, వాణిశ్రీ న‌ట‌న‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబాన్ని సైతం చెన్నైకే ప‌రిమితం చేసుకున్నారు.కానీ, విజ‌య‌నిర్మ‌ల కృష్ణ‌తో ప్రేమ‌, వివాహం.. హైద‌రాబాద్‌లో వ్యాపారం వంటివి తెలిసిందే.

అయితే..ఈ రెండు పొంత‌న‌లేని జీవితాల్లోనూ కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు అనూహ్యంగా చోటు చేసుకున్నాయి. వివాదాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు.. కూడా దారితీశాయి. విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తీసిన రెండు సినిమాల్లో వాణిశ్రీ న‌టించారు. ముఖ్యంగా కృష్ణ స‌ర‌స‌న కూడా వాణిశ్రీ అనేక సినిమాలు చేశారు. అయితే.. ఒక సినిమా ఏ కార‌ణంగానో విఫ‌ల‌మైంది. దీంతో నిర్మాత డ‌బ్బులు ఎగ్గొట్టారంటూ.. ప్ర‌చారం ప్రారంభించారు.

వాస్త‌వానికి నిర్మాత ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు. ఆయ‌న సినిమాకు ముందు.. త‌ర్వాత కూడా క్లియ‌ర్ చేస్తారు. కానీ, వాణిశ్రీ నుంచి వ‌చ్చిన ఒక సందేశం.. విప‌రీతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. వాణిశ్రీ పీఏ ఒకావిడ ఉండేది. ఆవిడ‌… వాణిశ్రీకి డ‌బ్బులు ఎగ్గొట్టార‌ని ప్ర‌చారం రేపారు. దీంతో అప్ప‌ట్లి మేగ‌జైన్ల‌లో జోరుగా గ్యాసిప్స్ ప్ర‌చారంలో వ‌చ్చాయి. విజ‌య‌నిర్మ‌ల సినిమాలో చేసిన వారికి డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని రాసుకొచ్చారు. దీంతో విజ‌య‌నిర్మ‌ల జోక్యం చేసుకున్నారు.

మ‌రుస‌టి రోజు వేరే సినిమా షూటింగ్‌లో ఉన్న వాణిశ్రీ వ‌ద్ద‌కు వెళ్లి ఇదే విష‌యంపై నిల‌దీశారు. విష‌యం తెలియ‌ని వాణిశ్రీకూడా.. త‌న‌పై పెత్త‌నం చేస్తోంద‌న్న ఉద్దేశంతో వివాదానికి దిగారు. విజ‌య‌నిర్మ‌ల టూ హాట్ క‌దా! అంతే వేగంతో వాణిపై వివాదానికి వెళ్లారు. ఇక వారిద్ద‌రి మ‌ధ్య మాట‌ల తూటాలు పేలి.. కొట్టుకోలేదు కాని.. అక్క‌డ వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చేసింది. చివ‌ర‌కు విష‌యం ఆదిశేష‌గిరిరావుకు తెలియడం.. ఆయ‌న కృష్ణ‌కు చెప్ప‌డంతో వివాదం స‌ర్దుమ‌ణిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news