Moviesఅన్‌స్టాప‌బుల్ 1,2 ఎంత పెద్ద హిట్లు అంటే… బాల‌య్య అంటే న‌చ్చ‌ని...

అన్‌స్టాప‌బుల్ 1,2 ఎంత పెద్ద హిట్లు అంటే… బాల‌య్య అంటే న‌చ్చ‌ని హీరోయే ఒప్పుకున్నాడుగా…!

బాలయ్య లాంటి సీనియర్ హీరో స్టార్ హీరో అసలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అసలు బాలయ్య ఓటీటీలోకి ఇస్తే ఎవరైనా చూస్తారా ? పైగా టాక్ షో అట.. అంత సీన్ లేదు.. బాలయ్య హోస్ట్ చేసే ఆ షో అటర్ ఫ్లాప్ అవుతుంది.. అసలు ఎవరూ చూడరు.. ఇది అన్‌స్టాప‌బుల్ సీజన్ 1 ప్రారంభానికి ముందు టాలీవుడ్ లో చాలామంది వ్యక్తపరిచిన అభిప్రాయాలు. బాలయ్యకు మాట్లాడటం రాదు.. అలాంటిది ఏకంగా టాక్ షో చేస్తాడా ? అది జరిగే పని కాదు అని.. టాలీవుడ్ లో తలపండిన సీనియర్ హీరోలు, చాలా పెద్ద పెద్ద తలకాయలు కూడా అంతర్గతంగా విమర్శలు చేశారు.

ఇక బాలయ్యను సోషల్ మీడియాలో ఎప్పుడు విమర్శించే ఒకరిద్దరు హీరోల అభిమానులు కూడా రెచ్చిపోయారు. బాలయ్య మరోసారి ట్రోలింగ్ కు గురవుతున్నాడు అంటూ జోకులు పేల్చారు. ఎప్పుడు అయితే అన్‌స్టాప‌బుల్ టీజర్ బయటికి వచ్చిందో… అప్ప‌టి నుంచి వీళ్ళ మబ్బులు వీడ‌డం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతూ ఉండటం.. బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుండడంతో పాటు… అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అసలు వీళ్ళకు ఏం ? మాట్లాడాలో నోరు పెగలని పరిస్థితి.

అన్‌స్టాప‌బుల్ షోలో సీజన్ 1 లో అన్ని ఎపిసోడ్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ అయితే సీజన్ 1 కే హైలెట్గా నిలిచింది. రెండో సీజన్ 1 అంత కాకపోయినా బాగానే క్లిక్ అయింది. లోకేష్ చంద్రబాబు ఎపిసోడ్‌తో పాటు, పవన్ ఎపిసోడ్ బాగా పేలాయి. ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెంకటేష్, రాణా కలిసి నటించిన రామానాయుడు వెబ్ సిరీస్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పైగా ఫ్యామిలీ హీరో వెంకీ ఇమేజ్ అంతా డేమేజ్ అయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

వెంకీకి ఇవి అవసరమా ? బాలయ్యను చూసి నేర్చుకోవాలని పెడుతున్నారు. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు కొద్దిరోజులుగా ఉబలాటపడుతున్నాడట. అయితే రామానాయుడు సీరియస్ నేపథ్యంలో వెంకటేష్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో స‌ద‌రు స్టార్ హీరో ఇప్పుడు వెనక ముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బాలయ్య అన్‌స్టాప‌బుల్ 1 ప్రారంభానికి ముందు సెటైర్లు వేసిన ఈ స్టార్ హీరో… ఏదేమైనా బాలయ్య సీజన్ 1, సీజన్ 2 రెండిట్లోనూ అదరగొట్టేశాడు. బాలయ్యను చూసి తాము నేర్చుకోవాలని తన అనుచరగ‌ణంతో అన్నట్టు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య టాక్ షోను ముందు నుంచి విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఆ టాక్ షోకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news