Moviesఆ రోజుల్లో ఫారిన్ లిక్క‌ర్‌కు కేరాఫ్ అడ్రెస్ ఆయన ఇళ్లే .....

ఆ రోజుల్లో ఫారిన్ లిక్క‌ర్‌కు కేరాఫ్ అడ్రెస్ ఆయన ఇళ్లే .. రంగారావు మందు కోసం అలా కూడా చేసారా..?

సినీ ఇండ‌స్ట్రీలో అల‌వాట్లు లేని వారు అంటే.. చాలా చాలా క‌ష్టం. ఇప్పుడుకూడా సినిమాల్లో న‌టిస్తున్న‌వారు పార్టీల పేరుతో వీకెండ్స్‌లో హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లోనూ అంటే.. బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో అయితే..రోజూ పార్టీలే! ఇప్ప‌ట్లా ఆ రోజుల్లో ఔట్ డోర్ షూటింగ్‌లు, ఫారిన్ లొకేష‌న్లు అంటూ..ఏవీ ఉండేవి కాదు. అన్నీ స్టూడియోల్లోనే.. లేక‌పోతే ప‌ల్లెటూర్ల‌లోనో.. షూటింగులు జ‌రిగేవి.

పైగా సాయంత్రం 6 త‌ర్వాత ఠంచ‌నుగా షూటింగ్ క‌ట్‌! దీంతో అంద‌రూ క‌లిసి క్ల‌బ్బుల బాట ప‌ట్టేవారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఇండియ‌న్ మేడ్ లిక్క‌ర్ క‌న్నా.. ఫారిన్ లిక్క‌ర్‌కు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపించేవారు. రాజ‌నాల‌, రాజ‌బాబు, శ్రీశ్రీ, ఎస్వీ రంగారావు వంటివారు టేబుల్ పంచుకునేవారు. రాజ‌నాల .. ఇండియ‌న్ మేడ్ లిక్క‌ర్ కావాలంటే.. రంగారావు, రాజ‌బాబు శ్రీశ్రీ వంటివారు ఫారిన్ వైపు చూసేవారు.

ఇలా ఫారిన్ లిక్క‌ర్‌కు అప్ప‌ట్లో న‌టులు పోటీ ప‌డేవారు. అయితే.. దేశంలో దీని ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ డంతో విదేశాల్లోని త‌న స్నేహితులు.. అభిమానుల ద్వారా రంగారావు ఫారిన్ లిక్క‌ర్‌ను తెప్పించేవార‌ట‌. దీనికి పెద్ద హ‌డావుడే చేసేవార‌ట‌. రెండు మూడు బాటిళ్ల‌ను త‌న‌తోనే తీసుకువెళ్లి షూటింగ్ అయిపోయిన త‌ర్వాత‌.. అటునుంచి అటే ప‌రివారాన్ని వెంటేసుకుని క్ల‌బ్బుకు చేరిపోయేవారు.

అక్క‌డే.. సీసాలు ఓపెన్ చేసేవారట‌. దీంతో ఫారిన్ లిక్క‌ర్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా రంగారావుపేరు నిలిచిపోయింది. అయితే.. ఇంత మంది ఎలా మందు తాగినా.. అన్న‌గారు ఎన్టీఆర్‌, అక్కినేని మాత్రం ఎప్పుడూ.. ఈ పార్టీల జోలికి పోయేవారు కాద‌ట‌. కొన్ని సార్లు వీరిని ఆట‌ప‌ట్టించినా.. ఎక్క‌డా కూడా వీరు వెన‌క్కిత‌గ్గిన ప‌రిస్థితి లేద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news