Moviesఆ టాలీవుడ్ హీరోను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోన్న ఆమె… !

ఆ టాలీవుడ్ హీరోను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోన్న ఆమె… !

టాలీవుడ్ లో సహజంగానే హీరోలకు… హీరోయిన్లకు మగవాళ్లు మేనేజర్లుగా ఉంటారు. ఒక హీరో కథల ఎంపికలోను… దర్శ‌కులను.. నిర్మాతలను ఎంచుకోవడంలోనూ మేనేజర్ల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. మేనేజర్లు కాస్త తెలివైన వాళ్ళు అయితే హీరోల దగ్గరకు మంచి కథలను.. మంచి నిర్మాతలను తీసుకువస్తూ ఉంటారు. హీరోల కెరీర్ ప్లానింగ్ విషయంలో మేనేజర్లు చాలా కీలకం. హీరోయిన్లకు కూడా ఎక్కువగా మగ మేనేజర్లే ఉంటారు. వాళ్ల చెప్పు చేతల్లోనే ఎక్కువగా హీరోయిన్లు డేట్లు ఇస్తూ ఉంటారు.

ఏ హీరోతో సినిమా చేయాలి ? ఏ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌నేది కూడా హీరోయిన్ల‌ను మేనేజ‌ర్లే గైడ్ చేస్తూ ఉంటారు. ఓ సినిమా విష‌యాన్ని మేనేజ‌ర్ హీరోయిన్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్ల‌క పోతే ఎవ్వ‌రూ చేసేదేం ఉండ‌దు. మ‌ధ్య‌లో ఉన్న మేనేజ‌ర్లు కూడా గ‌ట్టిగానే సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ అప్‌క‌మింగ్ హీరో విష‌యంలో రివ‌ర్స్‌లో న‌డుస్తోంది.

అత‌డో అప్‌క‌మింగ్ హీరో.. అయితే ఇప్పుడు ఆ హీరోను అత‌డి లేడీ మేనేజ‌ర్ పూర్తిగా కంట్రోల్ చేస్తోంద‌ట‌. చివ‌ర‌కు ఆ లేడీ మేనేజ‌ర్ ఏం చెపితే పూర్తిగా అదే వినే స్టేజ్‌కు ఆ హీరో ప‌డిపోయాడ‌ట‌. తొలి సినిమా హిట్ అయ్యాక ఆ లేడీ మేనేజ‌ర్ మ‌నోడి చెంత చేరింద‌ట‌. అప్ప‌టి నుంచి ఆ హీరోకు హిట్లు లేవు. ఆ లేడీ మేనేజ‌ర్ అత‌డిని గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఆడిచేస్తోంద‌ట‌.

సినిమా ఒప్పుకోవ‌డం నుంచి ఫినిషింగ్ వ‌ర‌కు అంతా ఆమె ఎలా ? చెపితే అలానే చేస్తున్నాడ‌ట‌. చివ‌ర‌కు నిర్మాత‌లు ఏదైనా ఆ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లినా ఆ మేనేజ‌ర్ చెప్ప‌క‌పోతే హీరో ఎస్ అన‌డం లేద‌ట‌. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ లేడీ మేనేజ‌ర్ టార్చ‌ర్ ఏంట్రా అని త‌ల‌లు పట్టుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల ఓ సినిమా షూటింగ్ న‌డుస్తోంద‌ట‌.

ఓ సీన్ న‌డుస్తుండ‌గా.. హీరోకు పెట్టిన బొట్టు ఆ లేడీ మేనేజ‌ర్‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో ఆమె అక్క‌డ‌కు వెళ్లి ఆ బొట్టు చెరిపేసి షూటింగ్ చేసుకోండ‌ని చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా అవాక్క‌య్యార‌ట‌. అస‌లు ఏ సీన్‌కు ఏం చేయాలో అది డైరెక్ట‌ర్ , కాస్ట్యూమ్స్ వాళ్లు చూసుకుంటారు.. కానీ ఆమె ఇలా చేయ‌డంతో ఇప్పుడు ఆమె టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news