MoviesIndraja "వాళ్ళ బుద్దే అంత"..ఫస్ట్ టైం పచ్చిగా మాట్లాడుతూ..భోరున ఏడ్చేసిన...

Indraja “వాళ్ళ బుద్దే అంత”..ఫస్ట్ టైం పచ్చిగా మాట్లాడుతూ..భోరున ఏడ్చేసిన ఇంద్రజ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేసిన ముద్దుగుమ్మ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పట్లో ఎంత మంది బడా బడా హీరోయిన్స్ ఉన్నా సరే అందరూ ఇంద్రజ వైపే చూసేవారు . దానికి మెయిన్ కారణం ఆమె సింప్లిసిటీ .. ఉన్నది ఉన్నట్లు మోహానే మాట్లాడటం .. చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండడం.. అప్పుడే కాదు ఇప్పటికీ అలానే ఉంది ..సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నా.. ఇంద్రజ మాత్రం తనదైన స్టైల్ లో సైలెంట్ గానే ఉంటూ.. తన లిమిట్స్ ని క్రాస్ చేయడం లేదు.

కాగా రీసెంట్ గా ఇంద్రజ ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యింది. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఓ కంపెనీ నెలసరి సమయంలో మహిళలకు ఉపయోగపడే ఐటమ్స్ కోసం మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది . ఈ క్రమంలోనే ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ఇంద్రజ స్టేజ్ పై మాట్లాడిన మాటలు అందర్నీ ఆలోచనలో పడేసేలా చేశాయి . జబర్దస్త్ లో స్కిట్స్ వేసినప్పుడు ఎలా నెమ్మదిగా ఓపికగా ఆన్సర్ చేస్తుందో ..రియల్ లైఫ్ లోను అంతే సైలెంట్ గా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది .ఇంద్రజ.. ఈ క్రమంలోనే ఆమె స్టేజిపై మాట్లాడుతూ..మగవాళ్ల గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది.

“మరో రెండు రోజుల్లోనే మహిళా దినోత్సవం రాబోతుంది . మనకు స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతుంది. ఇంకా ఆడ మగ సమానం అనే భావన .. ఈ ప్రపంచంలో లేదు. కానీ కొన్నిచోట్ల మాత్రం నేటి తరం మహిళలు మగవారితో సరి సమానంగా ప్రతి రంగంలోనూ పోటీపడుతూ .. టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు . అంతరిక్షంలోకి వెళ్తూ మహిళలు సత్తా చాటుతున్నారు . అది మన మహిళాల్లోకానికి గర్వకారణం అనే చెప్పాలి . మన దగ్గర మాత్రం మహిళలకు కనీసం 30% సమాన అవకాసం ఇవ్వడానికి కూడా మగవారికి మనసు రావడం లేదు . వాళ్ళ బుద్దే అంత మనమేం చేయలేం ..ఒకటి మాత్రం నిజం ప్రతిసారి మన ప్రాబ్లంని మగవారికి చెప్పుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు .. వాళ్ళు మన సమస్యని వినరు.. వాళ్లలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి ..ఓపికగా భరించడం నేర్చుకోండి.. అప్పుడే మగవారికి ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది .. వాళ్లలో తప్పులను వాళ్ళు తెలుసుకుంటారు” అంటూ మగవాళ్ళ గురించి పచ్చిగా ఉన్న నిజాలు ఉన్నట్టు మాట్లాడేసి అక్కడ ఉండే జనాలకు షాక్ ఇచ్చింది . ప్రెసెంట్ ఇంద్రజ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news