Movies"ఆ ఒక్కటి మార్చుకోరా బాబు"..గోపీచంద్ లో ప్రభాస్ కి నచ్చని ఏకైక...

“ఆ ఒక్కటి మార్చుకోరా బాబు”..గోపీచంద్ లో ప్రభాస్ కి నచ్చని ఏకైక విషయం ఇదే..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే అంశం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రభాస్ ఎపిసోడ్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎపిసోడ్ 1 ఆహాలో స్ట్రీమింగ్ అవ్వగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా టాక్ షోలోనే నెంబర్ వన్ రికార్డులు క్రియేట్ చేస్తూ .. 100 మిలియన్ వ్యూస్ అందుకుంది . కాగా రీసెంట్గా దీనికి సంబంధించిన ఎపిసోడ్-2 కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

కాగా మొదటి ఎపిసోడ్ లో బాలయ్య – ప్రభాస్ మాత్రమే కనిపించిన.. ఈ షోలో రెండో ఎపిసోడ్లో ..టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కూడా ఆలరిచాడు. మనకు తెలిసిందే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గోపీచంద్ -ప్రభాస్ ఎంతటి మంచి ఫ్రెండ్స్ అనే విషయం. కాగా ఈ క్రమంలోనే షోలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపడింది. ప్రభాస్ – గోపీచంద్ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా ప్రభాస్ కి గోపీచంద్లో ఓ విషయం పెద్దగా నచ్చదట. ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటాడని.. ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయంలో మార్పులు చేసుకోడని..కంప్లైట్ ఉండేది.

ఈ క్రమంలోనే జిల్ సినిమా టైంలో..ప్రభాస్..గోఫీ చంద్ ఫుల్ మేకోవర్ చేసాడు. జిల్ సినిమా కథను విన్న ప్రభాస్ ..గోపీచంద్ ని సజిస్ట్ చేశాడట . అంతేకాదు ఈ సినిమాలో “దయచేసి నీ స్టైల్ ,లుక్స్ హెయిర్ స్టైల్ మార్చమని” సజెషన్ ఇచ్చారట. ఇదే విషయాన్ని ప్రభాస్.. బాలయ్యకు చెప్పుకొచ్చాడు. అంతేకాదు బాలయ్య సైతం నీ అన్ని మూవీస్ లో కల్లా జిల్ మూవీలో స్టైల్ సూపర్ గా ఉంటుందని ..నాకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ఆహాలు స్ట్రీమింగ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news