Movies"అబ్బే..నేను ఆ టైప్ కాదు.."..ఒక్క మాట తో ఆయనకి గునపం దించేసిన...

“అబ్బే..నేను ఆ టైప్ కాదు..”..ఒక్క మాట తో ఆయనకి గునపం దించేసిన సుధీర్ బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సుధీర్ బాబు రీసెంట్ గా నటించిన సినిమా “హంట్”. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ముఖ్యంగా సామాన్య జనాలు కూడా ఈ సినిమాను చూసి సూపర్బ్ అంటూ రివ్యూ ఇవ్వడం సినిమా యూనిట్ కి కొత్త బూస్టప్ ఇచ్చింది .

కాగా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మీడియాతో సుధీర్ బాబు మాట్లాడుతూ ..ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ క్రమంలోని సుధీర్ బాబు మాట్లాడుతూ ..”సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది . ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు . మొదట ఈ కథ విన్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటారో అని బాగా భయపడ్డాను.. కానీ ప్రేక్షకులందరూ సెకండ్ హాఫ్ లో 30 నిమిషాలు సినిమా ఫిక్స్ కెళ్ళిపోయింది ..ఎక్స్లెంట్ అని చెప్తున్నారు . చాలా ఆనందంగా ఉంది రెగ్యులర్ కథలనే కాకుండా ఇలా డిఫరెన్స్ స్టోరీలు కూడా యాక్సెప్ట్ చేస్తారని అర్థమైంది . నా సినిమా హిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ ..నేనైతే రెగ్యులర్ గా సినిమాలు చేయను.. కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను యాక్సెప్ట్ చేస్తాను . నా కథలు ఇప్పటివరకు నేను నటించినవి అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి” అంటూ కామెంట్స్ చేశారు .

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సుధీర్ బాబు మరో హీరోకి కౌంటర్ వేశారని .. సినిమా ఎలా ఉన్నా కామన్ కథతో ముందుకు వెళ్లిపోయే ఈ హీరో పై సుధీర్ బాబు పరోక్షకంగా కామెంట్స్ చేశారని జనాలు చెప్పుకుంటున్నారు . మొదటి నుండి ఆయన పై సుధీర్ బాబు పరోక్షకంగా కౌంటర్ వేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఆ స్టార్ ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news