Moviesమరోసారి అడ్డంగా దొరిపోయారుగా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విజయ్-రష్మిక హాట్...

మరోసారి అడ్డంగా దొరిపోయారుగా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విజయ్-రష్మిక హాట్ పిక్స్..!!

తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ.. కొన్నిసార్లు స్టార్ సెలబ్రిటీస్ కూడా పొరపాట్లు చేసి మీడియాకి ..నెటిజన్లకి ..ఫాన్స్ కి అడ్డంగా బుక్ అవుతుంటారు. ఇప్పటికే ఇలా పొరపాట్లు చేసి ఎంతో మంది జంటలు అడ్డంగా బుక్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ రష్మిక మందన.

మనకు తెలిసిందే గీతగోవిందం అనే సినిమాతో ఈ జంట జతకట్టారు. అప్పటినుంచి ఈ జంట మధ్య ఏదో ఉంది అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టే వీళ్ళు బయట కనిపించినప్పుడు చేసే ప్రవర్తన.. నైట్ పబ్బుల ..పార్టీలకి వెళ్లే విజువల్స్ ..వీళ్ళ మధ్య ఏదో ఉంది అనేలా క్రియేట్ చేస్తున్నాయి . రీసెంట్గా న్యూ సందర్భంగా రష్మిక మందన ..విజయ్ దేవరకొండ వేరువేరుగా అభిమానులకు పోస్టులు పెట్టారు.

అయితే ఇద్దరు వేరువేరుగా పోస్ట్ పెట్టిన ఒక్క దగ్గరే ఉన్నారు అంటూ క్లారిటీకి వచ్చేసారు జనాలు. ప్రస్తుతం ఈ జంట మాల్ దీవ్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ జంట అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను సెలబ్రేట్ చేసుకుంది. విడివిడిగా పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయారు ఈ జంట. ప్రస్తుతం వీళ్ళు పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందన – విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news