Moviesఅందరు మరిచిపోయిన కేథరిన్ ని .."వాల్తేరు వీరయ్య" కి సజిస్ట్ చేసింది...

అందరు మరిచిపోయిన కేథరిన్ ని ..”వాల్తేరు వీరయ్య” కి సజిస్ట్ చేసింది ఆ స్టార్ హీరోనే..!!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక అందరి టైం ఒకేలా తిరుగుతుంది అని చెప్పలేం. అందరు స్టార్ హీరోయిన్స్ అవ్వాలన్న రూల్ లేదు . అందం , అభినయం , నటించే టాలెంట్ ఉన్నా కొంతమంది హీరోయిన్స్ కొన్ని కారణాల చేత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగలేదు .. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ క్యాథరిన్ ధెరిస్సా. ఈ పేరుకు ప్రత్యేక పరిచేయాల అవసరం లేదు పలు తెలుగు , తమిళ్ సినిమాలతో జనాలను బాగా అలరించింది.

అంతేకాదు అల్లు అర్జున్ అలాంటి బిగ్ స్టార్ హీరో తో కూడా సినిమాలో నటించింది. అయితే కెరియర్లో రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు పడినా కానీ ఎందుకో కేథరిన్ పేరును జనాలు పెద్దగా గుర్తుపెట్టుకో లేకపోయారు. అయితే అలాంటి అమ్మడుకు కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో అవకాశం రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ గా ఉంది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సినిమాలో కెధరిన్ పేరు ని సజిస్ట్ చేసింది ఓ స్టార్ హీరో అంటూ తెలుస్తుంది.

కెధరిన్ ను సెకండ్ హీరోయిన్గా పెట్టుకోమని అల్లు అర్జున్ నే సజెస్ట్ చేశాడట. మనకు తెలిసిందే బన్నీ – కేథరిన్ మధ్య అదో స్పెషల్ రకమైన ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది . తన సినిమాల్లో అమ్మడుకు అవకాశాలు ఇస్తూ బన్నీ ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు . కాగా ఇప్పుడు చిరంజీవి సినిమాలో సైతం ఆమెకు అవకాశం ఇప్పించి ఫ్రెండ్షిప్ ని ప్రూవ్ చేసుకున్నాడు . రీసెంట్ గా కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన బింబిసారా సినిమాలోను హీరోయిన్గా నటించింది కేథరిన్ .. ఈ సినిమా ఎంతటి పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే . కానీ ఆమె పేరు మాత్రం పాపులారిటీ లోకి రాలేదు . చూద్దాం వాల్తేరు వీరయ్య తో ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news