Moviesమహేశ్ బాబు కి ఆ ధైర్యం లేదా..? సొంత ఫ్యాన్సే ఇలా...

మహేశ్ బాబు కి ఆ ధైర్యం లేదా..? సొంత ఫ్యాన్సే ఇలా అంటున్నారేంటి రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూల్.. సాఫ్ట్.. హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు . ఇతగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే . కాంట్రవర్సీ కి దూరంగా.. నటనకు దగ్గరగా ..ఎంజాయ్ మెంట్ కి మరీ మరీ దగ్గరగా ఉంటాడు . కూల్ అన్న పదానికి మరో పేరుగా చెప్పుకునే మహేష్ బాబు ..ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఓ సినిమా లో బిజీగా ఉన్నాడు . అంతే కాదు ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లు తెరకెక్కే భారీ అడ్వెంచర్స్ ఫిలింలో నటించబోతున్నాడు .

కాగా ఇలా వరుస సినిమాలతో కమిట్ అయిన మహేష్ బాబు గురించి సొంత ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చను లేవదీశారు. రీసెంట్గా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఇద్దరు బడా హీరోలు టఫ్ ఫైట్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే . వీరసింహారెడ్డి పేరుతో బాలయ్య.. వాల్తేరు వీరయ్య పేరుతో మెగాస్టార్ ఇద్దరు కూడా తమ సినిమాను రిలీజ్ చేసి.. ఇద్దరు పాజిటివ్ హిట్లు అందుకున్నారు. అయితే ఇద్దరు కూడా ఈ సినిమాలో మాస్ యాంగిల్ మాస్ రోల్స్ లో కనిపించడం విశేషం .

ఈ క్రమంలోనే ఎప్పుడు ఒకే రొటీన్ స్టోరీలు చేసే మహేష్ బాబు మాస్ యాంగిల్ టచ్ చేస్తూ అలాంటి జోనర్ లో సినిమాలు తీస్తే చూడాలన్నది అభిమానుల కల . అయితే కొందరు మాత్రం మహేష్ బాబు మాస్ యాంగిల్ కి సెట్ అవ్వడని ..కూల్ క్లాస్ లుక్స్ కే బాగుంటాడని చెప్తున్నారు. అంతేకాదు మహేష్ బాబుకి మాస్ సినిమాలు చేసే ధైర్యం లేదని పలువురు ఫాన్స్ చెప్పుకు రావడం ఇంట్రెస్టింగ్గా మారింది . ఏది ఏమైనా సరే మహేష్ బాబు క్లాస్ లుక్ లోనే బాగుంటాడు.. దూకుడు సినిమాలో కొంచెం టైం మాస్ యాంగిల్ లో కనిపించి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే . అయితే ఎందుకో మహేష్ బాబు తన కెరియర్ లో ఫుల్ లెంత్ మాస్ సినిమా చేస్తే చూడాలి అన్నది అభిమానుల కల చూద్దాం..ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news